గుజరాత్​కు కేజ్రీవాల్​.. కాసేపటికే ఆప్‌ ఆఫీసులో సోదాలు!

-

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దిల్లీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అర్వింద్ కేజ్రీవాల్ తరచూ పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే  ఆదివారం సాయంత్రం అహ్మదాబాద్‌ చేరుకున్నారు. అయితే ఆయన నగరానికి వచ్చిన కొద్ది గంటలకే అహ్మదాబాద్‌లోని ఆప్‌ కార్యాలయంలో పోలీసులు సోదాలు జరపడం వివాదాస్పదంగా మారింది.

అహ్మదాబాద్‌లోని నవరంగ్‌పురా ప్రాంతంలో గల పార్టీ కార్యాలయంలో స్థానిక పోలీసులు సోదాలు జరిపారని ఆమ్‌ ఆద్మీ పార్టీ ట్విట్టర్​లో వెల్లడించింది. రెండు గంటల పాటు జరిపిన ఈ తనిఖీల్లో వారికి ఏం దొరకలేదని పేర్కొంది. కేజ్రీవాల్‌ అహ్మదాబాద్‌లో ల్యాండ్‌ అయిన కొద్ది గంటలకే ఈ సోదాలు జరిగాయి. దీంతో ఈ పరిణామాలపై దిల్లీ సీఎం ట్వీట్ చేస్తూ.. భాజపాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

“గుజరాత్‌ ప్రజల నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీకి వస్తోన్న మద్దతును చూసి భాజపాకు మతిభ్రమిస్తోంది.. ముందు దిల్లీలో తనిఖీలు చేశారు. ఇప్పుడు గుజరాత్‌లోనూ సోదాలు మొదలుపెట్టారు. దిల్లీ మాదిరిగానే ఇక్కడ కూడా వారికి ఏం దొరకదు. ఎందుకంటే మేం నిజాయతీ గల నాయకులం” అని రాసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news