రియల్ లైఫ్‌లో రామ్‌ కోసం సీత వెయింటింగ్… పెళ్లి లేకుండానే పిల్లలు కావాలట!

-

‘సీతా రామం’.. ఓ సాధారణ చిత్రంగా విడుదలై ప్రేక్షకుల మదిని కన్నీటితో బరువెక్కించిన మధుర కావ్యం. హను రాఘవపూడి దర్శకుడు. ఇంతకాలం థియేటర్లలో అలరించిన ఈ సినిమా శుక్రవారం నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా అందుబాటులోకి వచ్చింది సీతా, రామ్‌గా మృణాల్‌ ఠాకూర్‌, దుల్కర్‌ సల్మాన్‌ చెప్పిన ప్రతి మాటా.. పలికించిన ప్రతి భావాన్నీ నెటిజన్లు ఆస్వాదిస్తున్నారు. తమకు నచ్చిన సన్నివేశాలను సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తున్నారు.

అయితే ‘సీతారామం’ సినిమాతో ప్రేక్షకుల మది దోచుకుంది మృణాల్‌ ఠాకూర్‌. సినిమా చూసినప్పటి నుంచి కుర్రకారు సీత.. సీత.. అని కలవరిస్తున్నారనడం అతిశయోక్తి కాదు. అంతలా తన నటనతో మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఆ చిత్రంలోని సీత పాత్రలో ఒదిగిపోయి సినీ ప్రేమికుల మనసులో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అయితే తాను ప్రేమలో పడాలనుకుంటున్నట్లు, పిల్లల్ని కనాలనుకుంటున్నట్లు ఇటీవల ఓ షోలో వెల్లడించింది.

తాను ఒక జీవిత భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నానని చెప్పింది మృణాల్. తాను ఏ ఫీల్డ్​లో ఉన్నానో.. తన మైండ్లో ఏం రన్​ అవుతుందో.. తాను ఎక్కడి నుంచి వచ్చాను అనే విషయాలు తన భాగస్వామి అర్థం చేసుకోవాలని చెప్పింది. ఇవన్నీ ఇచ్చి తనను సురక్షితంగా చూసుకునేవాడు కావాలని పేర్కొంది. అయితే ఇలాంటి వాళ్లు అంత సులువుగా దొరకరు అని చెప్పింది మృణాల్.

కొన్ని సమయాల్లో తనకు పిల్లలు ఉంటే బాగుండు అనిపించిందని అన్నది.”మా అమ్మ ఎంత సపోర్టివ్​ అంటే.. ఓసారి నేను నా అండాల్ని భద్రపరచుకుంటా లేదా ఒంటరి తల్లిగా ఉంటానమ్మా అని అడిగితే.. వెంటనే ఓకే అనేసింది” అని వెల్లడించింది. ఇక ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై అశ్వనీ దత్‌ నిర్మించారు. రూ.30 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.80 కోట్లు వసూళ్లు చేసిందని సినీ విశ్లేషకులు అంచనా వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news