టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి ఖండిస్తున్నమని ఎపి పోలీస్ అధికారులు సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ రావు అన్నారు. ఆయన వ్యాఖ్యలు పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ఉన్నాయని అభిప్రాయం పడుతున్నామన్న ఆయన పట్టాభి గారి మాటలు టిఫిన్ లెక్కల్లా ఉన్నాయని, ఆయన గురించి మాట్లాడలన్నా ఏదోలా ఉందని అన్నారు. ఒక నేరం జరిగినప్పుడు దానికి ఒక పద్ధతి ఉంటుందన్న ఆయన టిఫిన్ చేసినట్టు ఎలా పడితే అలా చేయడానికి కుదరదని అన్నారు. పట్టాభి వ్యాఖ్యలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, తక్షణమే మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పోలీసుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మస్తాన్ ఖాన్ మాట్లాడుతూ వాస్తవాలు తెలియకుండా పట్టాభి మదనపల్లె ఘటనపై మాట్లాడటం ఆయనకు తగదని అన్నారు. పట్టాభిగారు డీజీపీ కి పాఠాలు చెప్తామ్ అని చెప్పడాన్ని చూస్తే నవ్వుతున్నారని అన్నారు. గత 5 ఏళ్లుగా గుళ్లపై దాడులు జరగలేదు ,ఇప్పుడెందుకు జరుగుతున్నాయో మాకు అనుమానాలు వస్తున్నాయని ఆయన అన్నారు. డిజిపి గారు మీరు ఏమి చేయాలో పట్టాభి అడుగుతున్నారంటే, మాకు పలు అనుమానాలు రేకెత్తుతున్నాయని ఆయన అన్నారు. మీరు కోరుకున్నట్టు పోలీస్ వ్యవస్థ పని చేయదన్న ఆయన, పోలీస్ వ్యవస్థను కించపరుస్తూ మాట్లాడటం తగదని అన్నారు. దీన్ని పోలీస్ అధికారులు సంఘం తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు.