వైరల్ ఫోటో; నేల మీద పడుకున్న పోలీసులు…!

-

కరోనా వైరస్ పై పోరాటంలో పోలీసుల కష్ట౦ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కుటుంబాలను వదిలి, తిండికి, నిద్రకు, కన్న తల్లి తండ్రులకు, కన్న పిల్లలకు దూరంగా బ్రతుకుతున్నారు. లాక్ డౌన్ కోసం కరోనా కట్టడి కోసం వాళ్ళు పడే కష్టం ఆ దేవుడికే తెలుసు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అలా నిలబడే ఉండాలి. విశ్రాంతి తీసుకుంటే ఎప్పుడు ఏం జరుగుతుందో… ఎవరు బయటకు వస్తారో అర్ధం కాదు.

మరి వాళ్లకు విశ్రాంతి ఎప్పుడు…? కాళ్ళకు ఉన్న బూట్లు విప్పడానికి కూడా ఉండదు. అందుకే అలానే పడుకుని పోయారు ఇద్దరు పోలీసులు. కరోనావైరస్ లాక్డౌన్ మధ్య ఇద్దరు పోలీసులు నేలమీద నిద్రిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో కనిపించింది. ఇది అత్యంత వేగంగా వైరల్ అవుతుంది. అరుణాచల్ ప్రదేశ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ మాధుర్ వర్మ ఈ చిత్రాన్ని ట్వీట్ చేసి, కరోనావైరస్ యోధులను మెచ్చుకున్నారు.

పోలీసులు వారి హెల్మెట్ మరియు లాఠీలను తమ మీద పెట్టుకుని నేలమీద నిద్రిస్తునన్నారు. “సౌకర్యవంతమైన మంచం మరియు ఎనిమిది గంటల నిద్ర అంత విలాసవంతంగా ఉంటుందా…? అవును మీరు ఒక పోలీస్ అయితే అలా పడుకోవచ్చు అంటూ… ఈ  కొరోనా వారియర్స్ ని చూసి గర్వంగా ఉందని ఆయన పోస్ట్ చేసారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో అత్యంత వేగంగా వైరల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news