పోలీసులకి చుక్కలు చూపిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వ్యక్తి.. హైటెన్షన్ పోల్ ఎక్కి మరీ !

-

 డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే పోలీసులు వాహనాన్ని సీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సీజ్ చేసిన అనంతరం దానిని యజమాని మళ్లీ కోర్టు ద్వారా పొందాల్సి ఉంటుంది. అయితే ఇదంతా మనకు ఎందుకు అనుకున్నాడో ఏమో తెలియదు కానీ ఒక వ్యక్తి తన బైక్ ను సీజ్ చేసి తనను అవమానించారని వెంటనే తన బైక్ ఇవ్వకపోతే చనిపోతానని చెబుతూ హైటెన్షన్ స్తంభం ఎక్కి కూర్చున్నాడు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు కూడా వణికిపోయిన పరిస్థితి ఏర్పడింది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని ఒక గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన తెలుగు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

మండలంలోని ఓ గ్రామానికి చెందిన నరేష్ చారి అనే వ్యక్తి తాజాగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలో పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు అతన్ని బైక్ ని సీజ్ చేసి కోర్టుకు వెళ్లి బైక్ పొందవలసిందిగా రసీదు ఇచ్చారు. దీంతో ఆ వ్యక్తి పోలీసులకు చుక్కలు చూపించాడు. దగ్గర్లో ఉన్న హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి కూర్చుని తన బైక్ తనకు ఇస్తానని చెబితే తప్ప కిందకు రానని కూర్చున్నాడు. కొన్ని గంటల హైడ్రామా అనంతరం స్థానిక ఎస్సై అతనికి ఫోన్ చేసి బైక్ ఇప్పిస్తానని హామీ ఇవ్వడంతో కిందకి దిగి వచ్చాడు. అతను పొరపాటున కింద పడతాడు ఏమో అనే భయంతో చాలా మంది వెళ్లి కింద పరదాలు పట్టుకుని నుంచున్నారు కూడా. కానీ దిగి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news