ఆత్మకథ లెవెల్లో మరణశాసనం రాసుకుంటున్న బాబు!

ఈ జన్మలో సాధించిన విజయాలు.. అధిరోహించిన శిఖరాలు.. చేసిన సేవలు.. పడిన ఇబ్బందులు.. తగిలిన దెబ్బల నుంచి నేర్చుకున్న పాఠాలు.. కోలుకున్న పట్టుదల ఆలోచనల గురించి భావితరాలకు చెప్పడానికి ఆత్మకథలు రాసుకుంటూ ఉంటారు పెద్దలు! వారి ఆత్మకథలు భవిష్యత్ తరాలకు ఉపయోగకరంగా ఉంటాయని, ఎందరికో ఆదర్శంగా ఉంటాయని కొందరి నమ్మకం! ఈ క్రమంలో ఆత్మకథ రాయాల్సిన వయసులో… చంద్రబాబు తన రాజకియ మరణశాసనం తానే రాసుకుంటున్నారు అనే విశ్లేషణలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి!

స్వర్గీయ నందమూరి తారాకరామారావు రాజకీయ జీవితంలో వైశ్రాయ్ హోటల్ సంఘటన ఒక మరపురాని దెబ్బ! నాటి నుంచి పెద్దాయన రాజకీయ, వ్యక్తిగత జీవితం విపరీతంగా దెబ్బతింది! కాకపోతే… అది మనుషులు, నమ్మిన వ్యక్తులు చేసిన అన్యాయం, ప్లాన్ చేసి కొట్టిన దెబ్బ! నాడు రామారావుకి జరిగిన స్థాయిలోనే ప్రకృతి.. కరోనా రూపంలో చంద్రబాబు రాజకీయ జీవితంపై దెబ్బకొట్టింది అనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి! గతంలో చేసిన పనుల ప్రతిఫలమో ఏమో కానీ… బాబు రాజకీయ జీవితాన్ని.. కరోనా ప్రశ్నార్ధకం చేసిందన్నా అతిశయోక్తి కాదేమో!

కరోనా సమయంలో ఇంట్లో ఉన్నా కూడా.. తన మనుగడ కాపాడుకోవడానికి, తమ పత్రికల్లో కవర్ పేజీల్లో వార్తల మట్టుకు మాత్రం వీడియో కాంఫ రెన్సులు నిర్వహిస్తూ వస్తున్నారు చంద్రబాబు! ప్రజాస్వామ్యంలో ఈ వీడియో కాంఫరెన్సులు, ట్విట్టర్ రాజకీయల ఫలితం గ్రౌండ్ లెవెల్లో శూన్యం అన్న విషయం బాబుకు తెలియంది కాదు కానీ… గత్యంతరం లేని పరిస్థితుల్లో అలా చేయాల్సి వస్తోందని సర్ధుకుంటున్నారు తమ్ముళ్లు! ఈ క్రమంలో అన్ని విషయాలపైనా ఆన్ లైన్ లో స్పందిస్తున్న బాబు… తనకు జన్మనిచ్చి, విద్యాబుద్దులు నేర్పించి, ఎమ్మెల్యేని చేసిన సొంత ప్రాంతంపై కక్ష పెట్టుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగు, తాగు నీరు అందించే బృహత్తర ప్రాజెక్టుకు ప్రాణంపోసే జీవో 203 విషయంలో ఇప్పటికీ బాబు రాయలసీమకు అనుకూలంగా స్పందించకపోవడం అనే విషయాన్ని… బాబు తనకు తాను రాసుకుంటున్న మరణశాసనంగా అభివర్ణిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు! ఎందుకంటే… ఈ ఒక్క విషయంలో బాబు కేసీఆర్ కు భయపడకుండా ఏపీ సర్కారుకు బాసటగా నిలుస్తూ… ఆ ఆరు జిల్లాల ప్రజలకు అండగా ఉండకపోవడం… ఆ ప్రాంతాల్లో రాజకీయంగా సమాది కట్టుకోవడంగానే భావించాలనేది విశ్లేషకుల వాదన! మానసిక వ్యాదితో బాదపడుతున్నారు అని చెబుతున్న డాక్టర్ సుధాకర్ విషయంలో బాబు ఇస్తోన్న ప్రాధాన్యం… ఇంత పెద్ద విషయంపై, ఆరు జిల్లాలకు నీరందించే విషయంపై ఎందుకు ఇవ్వడంలేదనే వాదన మరొకటి బలంగా వినిపిస్తుంది. దీంతో… ఈ వ్యవహారాలు అన్నీ కలిపి బాబు రాజకీయ మరణశాసనం తానే రాసుకుంటున్నారనే వాదనకు మరింత బలం చేకూరుతుంది!