షాకిచ్చిన రానా : ఈ రోజు సాయంత్రం 4 గంటలకు దగ్గుబాటి రానా మిహీకాల ఎంగేజ్మెంట్ …!

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దగ్గుబాటి రానా రీసెంట్ గా మిహీకా బజాజ్ తన ప్రేమకి ఓఅకే చెప్పిందని అందరికి సర్‌ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ న్యూస్ తెలియగానే రానా సినీ ప్రముఖులు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ఇక పెళ్ళికి ఇరు కుటుంబాలు అంగీకారం తెలిపారు. రానా – మిహిక బజాజ్ వివాహం ఈ ఏడాదిలోనే ఉంటుందని కుటుంబ సభ్యులు కూడా క్లారిటీ ఇచ్చేశారు. డిసెంబర్ కు ముందే పెళ్లి ఉండే అవకాశముందని.. వారిద్దరూ జీవితంలో ఒకటి కావాలనుకోవడం సంతోషమని రానా తండ్రి సురేష్ బాబు ఇటీవల వెల్లడించారు.

 

ఈ నేపథ్యంలో రానా – మిహీకా బజాజ్ల నిశ్చితార్థ ముహూర్తం నిర్ణయించేసారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు రామానాయుడు స్టూడియోలో రానా – మిహిక బజాజ్ ఎంగేజ్ మెంట్ జరగబోతుంది. ఈ కార్యక్రమానికి బంధు మిత్రులు, సన్నిహితులు హాజరుకానున్నారని తెలుస్తుంది.

ఇక హైదరాబాద్ లో పుట్టి పెరిగిన మిహీక బజాజ్.. బంటీ – సురేష్ బజాజ్ దంపతుల కుమార్తె. చెల్సియా విశ్వవిద్యాలయం నుండి ఇంటీరియర్ డిజైన్ లో మాస్టర్స్ డిగ్రీ పొందింది. ప్రస్తుతం ముంబైలో డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియోను సొంతగా నడుపుతున్నారు. అంతేకాదు మిహికా బజాజ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనం కపూర్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉంటుంది. రానా మిహిక ల వివాహానికి టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ కి చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు.