విజయనగరం: విశాఖ భూ కుంభకోణంపై వేసిన సిట్ రిపోర్ట్‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు బయటపెట్టడం లేదని సీపీఐ నేత రామకృష్ణ ప్రశ్రించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ స్కాంలో అనేక మంది అధికార పార్టీ నేతలున్నారని అన్నారు. మంత్రి గంటాకి చంద్రబాబు భయపడుతున్నారా? అని ఆయన అన్నారు. రాఫెల్ కుంభకోణంపై జేపీసీ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై ఈనెల 24న దేశవ్యాప్త ఆందోళన చేపడతామని రామకృష్ణ పేర్కొన్నారు.
విశాఖ భూకుంభకోణం రిపోర్టు ఎందుకు బయటపెట్టరు? సిపి ఐ రామకృష్ణ
-