జగన్ కి ఒకే రోజు 5 షాక్ లు…!

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒకే రోజు ఏకంగా 5 షాక్ లు తగిలాయి. రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు పార్లమెంట్ ఒక్కసారిగా జగన్ కి ఊహించని షాక్ ఇచ్చాయి. ప్రభుత్వ కార్యాలయాలకు వైసిపి రంగులు వేయటం కుదరదని ఇప్పటికే హైకోర్టు చెప్పినా దీనిని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఊరుకుంటారా అని ఎదురు ప్రశ్నించి సుప్రీంకోర్టు కొట్టివేసింది.

రాష్ట్ర హైకోర్టు విషయానికి వస్తే రాజధాని కోసం రైతుల నుంచి సమీకరించిన భూమిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఏ విధంగా ఇస్తారని హైకోర్టు నిలదీసింది. ఇది చట్ట విరుద్ధమని రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారం లేదని స్పష్టం చేస్తూ జీవో నిలుపుదల చేసింది. అదేవిధంగా మరో షాక్ ఇచ్చి౦ది హైకోర్టు. విశాఖపట్నంలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ఆరు వేల ఎకరాలను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు నిలిపివేసింది.

రైతులకు నోటీసులు ఇవ్వకుండా ఏ విధంగా సేకరిస్తారని పిటిషనర్ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. అదేవిధంగా పాతిక లక్షల మందికి పంపిణీ చేసిన ఇళ్ళ స్థలాలను ఐదేళ్ల తర్వాత విక్రయించుకునే వీలు కల్పించే కన్వేయన్స్ డీడ్ లపై ప్రభుత్వం జారీ చేసిన జీవోను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. ఇల్లు కట్టుకుంటా లేకుండా స్థలాలను ఏవిధంగా ఇస్తారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. రాజకీయంగా తగిలిన ఎదురుదెబ్బ చూస్తే శాసనమండలిని రద్దు సంగతి ప్రస్తావన కనీసం లేకుండానే పార్లమెంట్ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news