ఆంధ్ర యువ‌త‌కు స్వయం ఉపాధి కల్పించే పథకం ఇది ! 

-

  • 60 శాతం సబ్సిడీతో ట్ర‌క్కులు అందిస్తున్న ప్ర‌భుత్వం
  • అర్హులైన ఈబీసీ, బీసీ, ఎస్సీ వ‌ర్గాల ఆదాయ స్థితిని పెంచడం, నిరంతర స్వయం ఉపాధే ల‌క్ష్యం
  • స‌ద్వినియోగం చేసుకోవాలంటున్న వైకాపా నేత విజ‌య‌సాయి రెడ్డి

అమ‌రావ‌తిః ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువ‌తకు స్వ‌యం ఉపాధిని క‌ల్పించి వారి ఆదాయ‌న్ని పెంచే ల‌క్ష్యంతో వైఎస్ఆర్ ఆద‌ర్శ్ ప‌థ‌కాన్ని తీసుకువ‌చ్చింద‌ని వైకాపా నేత విజ‌య‌సాయి రెడ్డి వెల్ల‌డించారు. ఈ ప‌థకాన్ని సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం 2019-అక్టోబ‌ర్‌లో తీసుకువ‌చ్చింది. ఈ స్కీమ్‌లో భాగంగా ప్ర‌భుత్వం 60 శాతం స‌బ్సిడీతో అర్హులైన నిరుద్యోగ యువ‌త‌కు స‌రుకు ర‌వాణా ట్ర‌క్కుల‌ను అందిస్తోంది.  దీనిని రాష్ట్రంలోని నిరుద్యోగులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఆయ‌న విజ్ఙ‌ప్తి చేశారు. అయితే, ఈ ప‌థ‌కాన్ని సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి…

ఈ ప‌థకం ముఖ్య ఉద్దేశం

రాష్ట్రంలోని నిరుద్యోగ యువ‌త‌కు స్వ‌యం ఉపాధిని కల్పించి, వారి ఆదాయాల‌ను పెంచ‌డం. ఈ ప‌థ‌కం ద్వారా ర‌వాణా రంగంలో ఉపాధి అవ‌కాశాలు కల్పించ‌బ‌డ‌తాయి. ట్ర‌క్కుల కొనుగోలుకు సంబంధించి ల‌బ్దిదారుల‌కు బ్యాంకులు రుణాలను అంద‌జేస్తాయి. ఈ ప‌థ‌కం అమ‌లులో భాగంగా ప్ర‌భుత్వం దాదాపు 6000 ట్ర‌క్కుల‌ను అందిస్తామ‌నీ, వీటి ద్వారా ఇసుక‌, ఆహారం, పానీయాల వంటి ఇత‌ర స‌రుకుల ర‌వాణాకు ఉప‌యోగించ‌బ‌డ‌తాయ‌ని ప్ర‌భుత్వం తెలిపింది.

ఈ ప‌థ‌కం లబ్దిదారుల అర్హ‌తలు

ఈ పథకం ఏ ఉద్యోగం, వ్యాపారంతో సంబంధం లేని యువకులకు మాత్రమే అందుబాటులో ఉంది. అలాగే, చ‌ట్ట‌బ‌ద్దంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ నివాసి అయి ఉండాలి. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వర్గాలకు చెందిన అభ్యర్థులు, ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ కేటగిరీలకు చెందిన వారు,  గిరిజన, కాపు కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే సభ్యులు, మైనారిటీ వర్గాలకు చెందిన అభ్యర్థులకు ఈ పథకం అందుబాటులో ఉంటుంది. కుటుంబం లో నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండరాదు. అభ్యర్ధి వయస్సు 21-45 సంవత్సరాలు అయి ఉండాలి. కనీస విద్యార్హత  7వ తరగతి పాస్ అయి ఉండాలి.  ఎల్ఎంవీ  డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

దరఖాస్తుకు అవసరమైన ధృవ‌పత్రాలు

దరఖాస్తుదారులు తమ అధికారిక నివాస పత్రాలను సమర్పించడం తప్పనిసరి.  ఆ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ పౌరుడని, వారి ఆధార్ కార్డుల కాపీని గుర్తింపు రుజువు చూపించాల్సి ఉంటుంది.  అలాగే,  ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందినవారు కుల ధ్రువీకరణ పత్రాలు, మైనారిటీ సర్టిఫికెట్లు క‌లిగి ఉండాలి. దరఖాస్తుదారులు బ్యాంకు నుంచి రుణ ఆమోదాన్ని పొందిన తరువాత,  వారు ట్రక్కు కొరకు స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.  దరఖాస్తు ప్రక్రియ సమయంలో, రాష్ట్ర జిఎస్ టి డిపార్ట్ మెంట్ ద్వారా జారీ చేయబడ్డ పేమెంట్ స్లిప్ ని స్క్రూటినీ కొరకు సబ్మిట్ చేయాలి. దరఖాస్తుదారులు అందరూ కూడా బ్యాంకు ఖాతా వివరాలు మరియు పత్రాలను అందించాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అందించే  60 శాతం స‌బ్సిడీ డైరెక్టుగా ల‌బ్దిదారుని బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది.

ల‌బ్దిదారుల ఎంపిక ప్ర‌క్రియ ఎలా ఉంటుంది?

దరఖాస్తు అభ్యర్థనలు సేకరించిన తర్వాత అర్హులైన‌ అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత సెలక్షన్ కమిటీపై ఉంటుంది. సెలక్షన్ కమిటీలో 8 మంది సభ్యులు ఉంటారు.  మండల పరిషత్ అభివృద్ధి అధికారి అధ్యక్షులుగా (బ్యాంకుమేనేజర్, ITDA ప్రతినిధి, రవాణాశాఖ ప్రతినిధి సభ్యులు)  గల స్క్రీనింగ్, ఎంపిక కమిటీ అభ్యర్థులను గుర్తించి.. వారిని ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తుంది.

ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కం ప్ర‌యోజ‌నాలు వివ‌రిస్తూ.. స‌రైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో సరఫరా తగ్గడం వల్ల సరుకుల ధర పెరుగుతుంది. ఈ పథకం వల్ల మార్కెట్లో సరుకుల సరఫరా పెరుగుతుంది, తద్వారా ధరలు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో తగ్గుతాయి.  అలాగే, 5 సంవత్సరాల తరువాత రుణం తిరిగి చెల్లిస్తే.. ఈ ప‌థ‌కం ల‌బ్దిదారుడు వాహనయజమాని అవుతాడు. అట్టడుగు మరియు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను సృష్టించడతాయి.

Read more RELATED
Recommended to you

Latest news