ఎప్పుడు ఏ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్తారో అర్థంకాక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో చాలావరకు కూడా సమస్యలు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ కోసం సమర్థవంతంగా పని చేయలేక పోతున్నారు అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
తాజాగా వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొంతమంది నేతలు పార్టీకి దూరంగానే ఉన్నారు. అలాగే విశాఖలో కూడా కొంతమంది నేతలు పార్టీ కోసం పని చేయడం లేదు. అయితే ఇప్పుడు విశాఖ లో ఉన్న ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో దూరంగా ఉన్నారని సమాచారం. కార్పొరేషన్ ఎన్నికల్లో పని చేయాల్సి ఉన్నా సరే ఆయన పార్టీ కోసం పని చేయకుండా ఎక్కువగా ఇంట్లోనే ఉన్నారట.
చంద్రబాబు నాయుడు చెప్పిన సరే ఆయన బయటకు రావడం లేదని అంటున్నారు. గత కొన్ని రోజులుగా ఆయనకు అధికార వైసీపీ నుంచి ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే ఆయన సైలెంట్ అయ్యారని సమాచారం. ఆయన వైసీపీ లోకి వెళ్లే అవకాశం ఉందని కూడా కొంతమంది వ్యాఖ్యలు చేశారు. తాజాగా గంటా శ్రీనివాసరావు కూడా పార్టీ మారే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఎందుకు సైలెంట్ గా ఉన్నారు ఏంటి అనేది అర్థం కాక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.