చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంటిలిజెన్స్ చీఫ్ ఆఫీసర్ గా పనిచేసిన బేబీ వెంకటేశ్వరరావు ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏబీ వెంకటేశ్వరరావు నీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆయుధాలకు సంబంధించి అదేవిధంగా నిఘా పరికరాలు కొనుగోలు చేయడంలో ఏబీ వెంకటేశ్వరరావు అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ జగన్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ముందుగా జగన్ ప్రభుత్వం తనను సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ వేసిన పిటిషన్ పై విచారించిన అనంతరం, ఆయన సస్పెన్షన్ సమర్థనీయమే అని క్యాట్ ప్రకటించింది. దీంతో వెంకటేశ్వరరావు వాదన వీగిపోయింది. ఇటువంటి తరుణంలో నిఘా పరికరాలు విషయంలో కొనుగోలు విషయంలో పక్కా ప్రూఫ్స్ తో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు వెళ్లాలని ఏబీ వెంకటేశ్వరరావు డిసైడ్ అయ్యారు.