దేశ ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశమంతటా నిర్మానుష్యంగా మారింది. జనతా కర్ఫ్యూ పాటిస్తూ ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. చాలామంది ప్రముఖులు కూడా ఇంటికి పరిమితమయి సోషల్ మీడియాలో అవగాహన కార్యక్రమాల వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో తాజాగా కర్ఫ్యూ రోజే జగన్ కి బ్రేకింగ్ న్యూస్ లాంటి వార్త మరియు ఆర్టికల్ తన ఆదివారం కొత్త పలుకులో ఏబీఎన్ ఆర్కే రాయటం జరిగింది. ఫుల్ మేటర్ లోకి వెళ్తే కుల ద్వేషంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కమ్మ వాళ్ళని టార్గెట్ చేశారని పరోక్షంగా తెలియజేశారు.
తన ఆర్టికల్ లో ఒక వైసీపీ పార్టీకి చెందిన రెడ్డి సామాజికవర్గానికి చెందిన నాయకుడు, తెలుగుదేశం పార్టీకి బలంగా కమ్మ సామాజిక వర్గం ఉందని అందువల్లే రాష్ట్రంలో ఉన్న చౌదరి కులస్తులను వైయస్ జగన్ టార్గెట్ చేసినట్లు ఆ నేత తెలిపినట్లు ఏబిఎన్ ఆర్కే తన ఆర్టికల్లో తెలిపారు. కమ్మ కులస్థులకు చెందాల్సిన బిల్లుల విషయంలో జగన్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రస్తుతం బిల్లు చెల్లింపులు జరగటం లేదని తెలిపారు.
కేవలం తన పరిపాలనలో రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ మిగతా సామాజిక వర్గాలకు చెందిన వాళ్లని తొక్కేస్తున్నారు అని ఏబిఎన్ ఆర్కే మండిపడ్డారు. ముఖ్యమంత్రి గా ఉండాల్సిన జగన్ ఈ విధమైన ఆలోచనా ధోరణి కలిగి ఉండటం మంచిది కాదు అన్నట్టు, ఓ రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో ఉన్న కమ్మ కులానికి చెందిన వాళ్లను రోహింగ్యాల కన్నా దారుణంగా చూస్తున్నారని ఆయన ఆర్టికల్లో బట్టబయలు చేశారు. అలాగే ఈ సందర్భంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ పై జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించటం జరిగింది.