విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన కారు.. ఎమ్మెల్యే కొడుకు తో పాటు ఏడుగురు మృతి

బెంగుళూరులోని కోరమంగల మార్స్ వెల్ఫేర్ హాల్ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అది వేగం కారణంగా ఓ కారు రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. వీరిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉండడం గమనార్హం. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కారులోని ఎయిర్ బ్యాగులు తెరుచుకోకపోవడంతో.. ఈ ప్రమాదం సంభవించింది.

మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇంకా ఈ ప్రమాదంలో మృతి చెందిన వారంతా 20 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న వారే అని సమాచారం అందుతోంది. మృతులను కరుణాసాగర్, బిందు, అక్షయ్ గోయల్, ఇషిత, ధనుషా, రోహిత్ మరియు ఉత్సవ్ గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం మృతదేహాలకు బెంగళూరులోని సెయింట్ జాన్స్ ఆస్పత్రిలో పోస్టుమార్టం జరుగుతోంది. ఇక అటు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.