ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల బయటపడిన ఈఎస్ఐ కుంభకోణం పెను సంచలనం సృష్టించింది. బయటకు వచ్చిన ఆధారాలను బట్టి తెలుగుదేశం పార్టీ హయాంలో మంత్రి అచ్చెన్నాయుడు అడ్డంగా దొరికిపోయినటు అన్న టాక్ ప్రస్తుత ప్రభుత్వంలో గట్టిగా వినబడుతుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖమంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఎన్ని కుట్రలు చేసిన ఈఎస్ఐ కుంభకోణం నుంచి తప్పించుకోలేరని అన్నారు.
బయటకు వచ్చిన ఆధారాల బట్టి చూస్తే కుంభకోణం భారీస్థాయిలో జరిగిందని కార్మికులను నిలువునా దోపిడీ చేసిన దోచుకున్నారు అని చంద్రబాబు ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా అక్రమాలు చేసినవారిపై చర్యలు తీసుకోవడానికి విజిలెన్స్ విచారణకు ఆదేశించామన్నారు. మాజీమంత్రి అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడ్డారనడానికి ఆయన రాసిన లేఖ సాక్ష్యమని చెప్పారు.
అంతేకాకుండా విజిలెన్స్ నివేదిక ఆధారంగా అక్రమంగా చెల్లించిన బిల్లు మరియు సొమ్మును ఖచ్చితంగా రికవరీ చేస్తామని గ్యారెంటీగా అచ్చెన్నాయుడు జైలు ఊసలు లెక్క పెట్టడం ఖాయమంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు విషయమై ప్రత్యేకంగా దర్యాప్తు చేయించడానికి సీఎం జగన్ నార్త్ ఇండియా నుంచి ఇలాంటి కేసుల్లో నిందితులను ఆధారాలతో సహా జైలు కి పంపే పట్టుకో కలిగి ట్రాక్ రికార్డు కలిగిన ఒక స్పెషల్ ఆఫీసర్ నీ రంగంలోకి దింపుతున్నట్లు ఏపీ రాజకీయాల్లో వినబడుతున్న టాక్.