ఝార్ఖండ్ లో ఎంఐఎం పోటీ.. కాంగ్రెస్, జెఎంఎం ఓట్లు చీల్చే అవకాశం..

-

మహారాష్ట, ఝార్ఖండ్ లో ఎన్నికల వేడి పెరిగింది.. అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార పార్టీ పావులు కదుపుతుంటే.. పీఠాన్నిఅధిరోహించాలని ప్రతిపక్షాలు తహతహలాడుతున్నాయి.. ఝార్ఖండ్ లో తాము కూడా బరిలోకి దిగుతున్నట్లు ఎంఐఎం పార్టీ ప్రకటించింది.. మరో పార్టీ ఆమ్ ఆద్మీ మాత్రం ఈ ఎన్నికలపై ఎలాంటి ప్రకటనలు చెయ్యలేదు.. ఝార్ఖండ్ లో ఎన్నికల నోటిపికేషన్ విడుదల అవ్వడంతో రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచాయి..అభ్యర్దులను ప్రకటించే పనిలో పడ్డాయి..

ఝార్ఖండ్ లో అధికారాన్ని నిలట్టుకోవాలని జేఎంఎం, కాంగ్రెస్ పావులు కదుపుతుండగా.. ఈసారి ఎలాగైనా పీఠాన్ని అధిరోహించాలని బిజేపీ ప్రయత్నిస్తోంది.. తన అరెస్టుకు రివేంజ్ తీర్చుకోవాలని సీఎం హేమంత్ సోరెన్ పట్టుదలతో ఉన్నారు.. 81 సీట్లున్న ఝార్ఖండ్ లో 70 స్థానాలు పోటీ చేస్తున్నట్లు రెండు పార్టీలు ప్రకటించాయి.. అందులో భాగంగా జేఎంఎం 35 మంది అభ్యర్థుల జాబితాను JMM విడుదల చేసింది. కాంగ్రెస్ కూడా 21 సీట్లను ప్రకటించింది..

మరోపక్క ఎన్డీఏ సీట్లు ఖరారు అయ్యాయి.. ఏజేఎస్ యూ 10, జేడీయూ 2 సీట్లు, ఎల్పీజేపీకి ఒక్క సీటును ఇస్తున్నట్లు కూటమి ప్రకటించింది.. 81 సీట్లలో పోటీ చెయ్యాలని తొలుతా బిజేపీ ప్రయత్నించింది.. కానీ మిత్రపక్షాలు అడ్డుతగలడంతో 68 సీట్లకే పరిమితమైంది.. అయితే ఎంఐఎం పోటీ చేస్తే.. కాంగ్రెస్, జేఎంఎంలకు దెబ్బ పడే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. ఎంఐఎం పోటీ చేస్తే ఎన్డీఏకు లబ్ది చేకూరే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది.. మొత్తంగా రెండు కూటములకు ఈ ఎన్నికలు టప్ పైట్ గా మారాయి..

Read more RELATED
Recommended to you

Latest news