ఆలీ కి రాజ్యసభ…? జగన్ బంపర్ ఆఫర్…!

-

ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల సందడి నెలకొంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎవరిని రాజ్యసభకు పంపిస్తారు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ నెల ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు గాను ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 26 న ఎన్నికలు జరగనున్నాయి. దీనితో అధికార పార్టీ నుంచి పార్లమెంట్ గడప ఎవరు తొక్కుతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

రాజ్యసభ సీట్ల విషయంలో ఇప్పటి వరకు దాదాపు పది మంది పేర్లు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. మాజీ కేంద్ర మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రస్తుత మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోసు సహా పలువురి పేర్లు ప్రధానంగా వినపడుతున్నాయి. అయోధ్య రామిరెడ్డి, వైఎస్ షర్మిల, మెగాస్టార్ చిరంజీవి పేర్లు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. ఇక మైనార్టీ కోటా లో కూడా ఒకరిని పంపే అవకాశం ఉంది.

ఇందులో భాగంగా కొంత మంది నేతల పేర్లను జగన్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. అందులో ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన సినీ నటుడు అలీ పేరు ప్రధానంగా ప్రస్తావనకు వస్తున్నట్టు సమాచారం. ఆలీ ఆర్ధికంగా బలంగా ఉన్న వ్యక్తి దానికి తోడు మైనార్టీలో ప్రాచుర్యం పొందిన అగ్ర నటులలో తెలుగులో ఆలీ ముందు వరుసలో ఉన్నారు. దీనితో ఆయనను రాజ్యసభకు పంపిస్తే బాగుంటుంది అనే ఆలోచన జగన్ చేస్తున్నారు.

త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. హిందూపురంలో బాలకృష్ణపై పోటీ చేసిన ఓడిపోయిన ఇక్బాల్‌ను ఆ తరువాత కొద్దిరోజులకే శాసనమండలికి పంపించారు వీరితో పాటు జగన్‌కు సన్నిహితంగా ఉంటే రెహమాన్‌తో పలువురు మైనార్టీ నేతల పేర్లు కూడా ఎక్కువగా వినపడుతున్నాయి. త్వరలోనే రాజ్యసభకు వీరిలో ఎవరిని ఎంపిక చేస్తారు అనేది చూడాలి .

Read more RELATED
Recommended to you

Latest news