చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ మధ్య రాజకీయ ఒప్పందం ఉందని… చంద్రబాబుకు ఓటేసినా.. పవన్ కు వేసినా ఒకటేనని.. వాళ్లిద్దరూ ఒకటేనని.. చంద్రబాబు చెప్పినట్టే పవన్ వింటారని హర్షకుమార్ ఆరోపించారు.
ఏపీలో ఎన్నికలు ఇంకా వారం రోజులు కూడా లేవు. ఇంకా వైఎస్సార్సీపీ పార్టీలోకి వలసలు మాత్రం ఆగట్లేవు. టీడీపీకి భారీ షాక్ లు ఇస్తూ టీడీపీకి చెందిన ముఖ్య నేతలంతా వైసీపీలో చేరుతున్నారు. ఇప్పటికే చాలామంది టీడీపీ నేతలు వైసీపీలో చేరారు. దీంతో ఏపీలో టీడీపీ దాదాపు ఖాళీ అయినట్టే కనిపిస్తున్న తరుణంలో టీడీపీకి మరో షాక్ ఇస్తూ… వైసీపీలో జాయిన్ అయ్యారు అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్.
హర్షతో పాటు ఆయన కొడుకు శ్రీహర్ష కూడా వైఎస్సార్సీపీలో చేరారు. జగన్ సమక్షంలో వాళ్లు వైసీపీలో చేరగా… వారికి పార్టీ కండువా కప్పిన జగన్.. వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. అయితే.. హర్ష కుమార్ ఇటీవలే చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే.. ఆయనకు అమలాపురం ఎంపీ టికెట్ దక్కుతుందేమోనని ఆశించారు. కానీ.. హర్షకు చంద్రబాబు మొండి చేయి చూపించడంతో తాజాగా వైసీపీలో చేరారు.
ఈసందర్భంగా మీడియాతో మాట్లాడిన హర్షకుమార్.. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ మధ్య రాజకీయ ఒప్పందం ఉందని… చంద్రబాబుకు ఓటేసినా.. పవన్ కు వేసినా ఒకటేనని.. వాళ్లిద్దరూ ఒకటేనని.. చంద్రబాబు చెప్పినట్టే పవన్ వింటారని హర్షకుమార్ ఆరోపించారు.