తెలంగాణా కోటపై బీజేపీ జెండా…“షా”..వ్యూహం ఫలించేనా…??

-

కేసీఆర్ ఎంతో కష్టపడి నిర్మించుకున్న తెలంగాణా కోట ఇప్పుడు చేజారి పోనుందా.?? తెలంగాణలో పాగా వేయడానికి “షా” దగ్గర ఉన్న ఎత్తులు ఏమిటి..?? ఇంతకీ షా ఏమన్నారు..? ఏమిటా వ్యూహం..?? అనే వివరాలలోకి వెళ్తే..

తెలంగాణా రాజకీయ ముఖచిత్రం మారిపోనుందా..?? కేసీఆర్ ఎంతో కష్టపడి నిర్మించుకున్న తెలంగాణా కోట ఇప్పుడు చేజారి పోనుందా.?? తెలంగాణలో బీజేపీ జెండా రెపరెపలాడనుందా..?? అంటే అవుననే అంటున్నారు రాజకీయ నిపుణులు. అసలు బీజేపీ  రాజకీయ వ్యుహకర్త మోడీ సలహాదారు అమిత్ షా వ్యూహం ఏమిటి…?? తెలంగాణలో పాగా వేయడానికి “షా” దగ్గర ఉన్న ఎత్తులు ఏమిటి..?? ఇప్పుడు ఇదే తెలంగాణా రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అమిత్ షా కొంతమంది తెలంగాణా లోని బీజేపీ నేతలతో తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీఆర్ఎస్ లో గుబులు పుట్టిస్తున్నాయి. ఇంతకీ షా ఏమన్నారు..? ఏమిటా వ్యూహం..?? అనే వివరాలలోకి వెళ్తే..

బీజేపే అధినాయకత్వం తెలంగాణలో పాగా వేయడానికి అన్ని అవకాశాలని ఉపయోగించుకోవడానికి సిద్దం అవుతోందని తెలుస్తోంది. షా చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్సనం అంటున్నారు. తాజాగా షా కొంతమంది బీజేపీ నేతలతో తెలంగాణలో మన సర్కార్ వస్తోంది. రావాల్సిందే అంటూ  కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. ఎలాగైనా తెలంగాణాలో అధికారంలోకి రావడానికి గట్టిపట్టు పడుతున్నారట. గారిక పాటి మోహన్ రావు తాజాగా షా ని కలిసినప్పుడు ఆయనకి  కొన్ని కీలక మార్గదర్సకాలు సూచించినట్టుగా తెలుస్తోంది.

ఇదిలాఉంటే ఇప్పటికే గరికపాటిని మెదక్, వరంగల్, రంగారెడ్డి ఖమ్మం జిల్లాలలోని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకి చెందిన కొంతమంది కీలక నాయకులు కలుసుకున్నారట. అంతేకాదు టీడీపీ  సీనియర్ మోస్ట్ నేతగా ఉన్న మోత్కుపల్లి నరసింహులు టీడీపీకి రాజీనామా చేసిన విషయం విధితమే అయితే ఇప్పుడు ఆయన ఆగస్టు 25 న బీజేపీలో చేరనున్నట్టు విశ్వనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. బీజేపీలో గనుకా మోత్కుపల్లి చేరితే తమ పార్టీ మరింత బలోపేతం అవుతుందనే అంచనాలు వేస్తున్నారు బీజేపీ సీనియర్స్.

మరో వైపు మలుపు అనే సంస్థ ద్వారా ఎంతో మంది బడుగు వర్గాలకి మేలు చేకూర్చిన మాజీ డీజీపీ కృష్ణ ప్రసాద్ కూడా బీజేపీలో చేరనున్నారట. ఈ ఇద్దరితో చర్చలు దాదాపు ముగిశాయని. త్వరలోనే వారు ఇరువురు షా సమక్షంలో పార్టీలో బీజేపీలో చేరుతారని టాక్ విన్పిస్తోంది. అంతేకాదు టీఆర్ఎస్ లోని కొందరు కీలక నేతలు కూడా కాషాయం కండువా కప్పుకునేలా చర్చలు జరుగుతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా  వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ని గద్దె దించి తెలంగాణలో కాషాయ జెండా ఎగరేయాలనేది బీజేపీ టార్గెట్ గా పెట్టుకుందని అంటున్నారు విశ్లేషకులు.

Read more RELATED
Recommended to you

Latest news