నేడు అమ్మ ఒడి లబ్ధిదారుల తొలి జాబితా ప్రకటన..

-

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న అమ్మఒడి పథకం లబ్ధిదారుల జాబితాను నేడు రాష్ట్రంలోని గ్రామ సచివాలయాల్లో సామాజిక తనిఖీ నిమిత్తం ప్రదర్శించనున్నారు. సంపూర్ణ అక్షరాస్యత సాధనకు, పేదరికంతో పిల్లలు బడికి దూరం కాకుండా ఉండేందుకు ఎన్నికల హామీ అమలులో భాగంగా జగనన్న అమ్మఒడి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్‌ వరకు చదువుతున్న పిల్లల తల్లిదండ్రుల్ని ఈ పథకానికి అర్హులుగా నిర్ణయించారు. 15 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తారు.

ఇప్పటికే ఇంటింటికీ తిరిగిన గ్రామ, వార్డు వలంటీర్లు అర్హుల జాబితాను తయారు చేయగా, మొత్తం 46,78,361 మంది తల్లులను జగనన్న అమ్మ ఒడి పథకం లబ్దిదారులుగా తేల్చారు. ఈ నేపథ్యంలో, తమ పేర్లు ఉన్నాయో, లేదో చూసుకునేందుకు మహిళలు పెద్దఎత్తున తరలిరావడంతో, పలు ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఇక ఆపై అభ్యంతరాలు, మార్పులు, చేర్పులను జనవరి 2 వరకు స్వీకరిస్తారు. ఆపై 9న తుది జాబితాను విడుదల చేసి, అదే రోజున తల్లుల ఖాతాల్లో రూ. 15 వేల చొప్పున జమ చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news