ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణపట్నం ఆనందయ్య మందు గురించే చర్చ జరుగుతోంది. ఇది ఎలా పనిచేస్తుంది, దీన్ని ఎలా తయారు చేస్తున్నారంటూ అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో తెగ రచ్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు దీనికి తాత్కాళికంగా బ్రేక్ పడిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఐసీఎంఆర్ ఆయుష్ ఆయుర్వేద శాఖ దీనిపై పరిశీలన జరుపుతోంది.
ఈ మందుతో ఎలాంటి హానికరం కాదని ఆయుష్ స్పష్టం చేసింది. అయితే దీనిపై పూర్తి స్థాయి నివేదిక రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఈ మందుపై ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆసక్తికర కామెంట్లు చేశారు. ఆదివారం చిత్తూరు జిల్లా ఆయుర్వేద నిపుణులతో కలిసి ఆయన కృష్ణపట్నం వెళ్లి మందును పరిశీలించారు.
ఈ మందుకు పర్మిషన్ వస్తే టీటీడీ ఆయుర్వేద ఫార్మీసీలోనే తయారు చేసి, రాష్ట్ర మంతా పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఆయుష్ పూర్తి స్థాయి నివేదిక కోసం వెయిట్ చేస్తున్నామని, నివేదిక వచ్చాక దీన్ని ఇమ్యూనిటీ బూస్టర్లుగా తయారు చేసే ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు. ఒకవేళ అదే జరిగితే తెలుగు రాష్ట్రాల్లో ఈ మందును అధికారికంగా పంచే అవకాశం ఉంది.