ఆ ఇద్దరు జగన్ కంట్లో నలుసు అయ్యారా..?

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ఒక ఇద్దరి తీరు ఇప్పుడు చుక్కలు చూపిస్తుంది. ఆ ఇద్దరు కూడా తాను ఎంతో అభిమానించి, గెలుపుకి కృషి చేసిన ఆ ఇద్దరు ఇప్పుడు జగన్ ని ఇబ్బంది పెట్టడం రాజకీయ వర్గాల్లో కూడా చర్చకు దారి తీస్తుంది. ఆ ఇద్దరే చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని, నరసరాపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు. ఈ ఇద్దరు ఇప్పుడు జగన్ కి చుక్కలు చూపిస్తున్నారు.

ఒక పక్క గుంటూరు జిల్లాలో రాజధాని ఉద్యమం జరుగుతుంటే ఈ ఇద్దరి వ్యవహారశైలి తో జగన్ మరింత ఇబ్బంది పడుతున్నారు. వాస్తవానికి లావు కృష్ణదేవరాయలు గుంటూరు పార్లమెంట్ కి పోటీ చెయ్యాల్సి ఉంది. కాని అప్పుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పార్టీలోకి రావడం ఆయనకు అక్కడ వర్గం ఉండటంతో జగన్ అక్కడ అవకాశం ఇచ్చారు. విడదల రజని తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వచ్చారు.

ప్రత్తిపాటి పుల్లారావు ని ఓడించగా లావు టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గంలో ఎంపీ అయ్యారు. ఇద్దరూ కూడా ఆర్ధికంగా బలంగా ఉన్న నేతలే. అటు ప్రజల్లో కూడా మంచి ఆదరణ ఉంది. దీనితో ఆ ఇద్దరికీ జగన్ పెద్ద పీట వేసారు. అయితే ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు రోజు రోజుకి తీవ్రమవుతుంది. చిలకలూరి పేట ఎమ్మెల్యే స్వగ్రామమైన పురుషోత్తంపట్నంలో బైరా కుటుంబీకులు ఏర్పాటు చేసిన ప్రభను సందర్శించేందుకు నిర్వాహకులు ఆహ్వానించగా,

బైరా వారి ప్రభ వద్దకు వెళ్ళే ముందు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ ఇంటికి వెళ్ళి ఆ తరువాత ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. మర్రి కుటుంబం మీద ఎమ్మెల్యే కు ముందు నుంచి అసంతృప్తి ఉంది. తనకు వ్యతిరేకంగా పని చేసారు అనే కోపం ఆమెలో ఉంది. దీనితో ఎంపీని అడ్డుకుంది రజని వర్గం. ఆ సంఘటన జరిగిన మరునాడే కట్టుబడివారిపాలెం వద్ద రజనీ మరిది గోపి కారు పై దాడి జరిగింది.

ఈ ఇద్దరికీ ఎన్నికల ముందే అభిప్రాయ భేదాలు వచ్చాయి. లావు, ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ తన వర్గాన్ని తయారు చేసుకోవడం తో పాటుగా కార్యకర్తల్లో యువకులను గుర్తిస్తూ ఉంటారు. ఎమ్మెల్యే గారికి ఇది నచ్చలేదు. ఆయనకు వర్గాన్ని దూరం చేయడానికి. పేటలో ఆయన మెజారిటి తగ్గించడానికి ఆమె ప్రయత్నాలు చేసారు. అయినా పైన జగన్ ఉండటంతో లావు సైలెంట్ గా ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఈ ఇద్దరు ఇలా ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించాలి అని చూడటం ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news