“మూడు రాజధానుల నిర్ణయం సరైనదే ” జగన్ నిర్ణయానికి జై కొట్టింది ఎవరో తెలిస్తే బాబు నిద్రపోడు !!

-

2014 ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక ఉద్దేశపూర్వకంగా తన సామాజిక వర్గానికి తన బినామీలకు మేలు చేకూరే విధంగా అమరావతి రాజధానిగా ప్రకటించక ముందు ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి ఆ ప్రాంతంలో తన వారిచేత భూములను కొనిపించి అక్కడ రాజధానిని చంద్రబాబు ప్రకటించడం జరిగిందని ఇటీవల అసెంబ్లీలో వైసీపీ పార్టీ నేతలు ఆరోపించడం జరిగింది.

ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ఉండటంతో రాష్ట్ర రాజధాని విషయంలో వికేంద్రీకరణ అనే అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి ఒక చోట మాత్రమే అభివృద్ధి జరిగితే గతంలో హైదరాబాద్ కోల్పోయి ఆర్థికంగా మనమే నష్టపోయాం అటువంటి పరిస్థితి భవిష్యత్తు తరాలకు మనం చేయకుండా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని మూడు రాజధానులు కాన్సెప్ట్ తెరపైకి తీసుకువచ్చారు. దీంతో జగన్ ప్రకటించిన మూడ రాజధానుల పై తెలుగుదేశం పార్టీ నేతలు అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు ఆందోళనలు నిరసనలు వ్యక్తపరుస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

 

ఇటువంటి నేపథ్యంలో జగన్ తీసుకున్న నిర్ణయం చాలా కరెక్ట్ అని మూడ రాజధానుల కాన్సెప్ట్ కి జై కొట్టారు ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ అగరాల ఈశ్వరరెడ్డి. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ అద్భుతమైన నిర్ణయాలతో పరిపాలన చాలా చక్కగా చేస్తున్నారని విశాఖలో రాజధాని, కర్నూల్‌లో హైకోర్ట్ ఉండటం వల్ల అందరికి మేలు జరుగుతుందని అన్నారు. ఇకపోతే అమరావతి కోసం అంటూ చంద్రబాబు జోలె పట్టి అడుక్కోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. చంద్రబాబు ఉద్యమం పేరుతో అనవసరంగా రైతులను రెచ్చగొడుతున్నారని అన్నారు. అమరావతి మీద ఇచ్చిన నివేదికలను తగలబెట్టడం దారుణమని అన్నారు. చంద్రబాబు దగ్గర అక్రమంగా సంపాదించిన డబ్బు చాలా ఉందని, మళ్ళీ జోలె పట్టుకుని అడ్డుక్కోవడం ఎందుకని ప్రశ్నించారు. దీంతో ఇప్పటికే చాలామంది జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయంపై సీనియర్ నేతలు జై కొడుతున్న తరుణంలో తాజాగా ఏపీ మాజీ స్పీకర్ అగరాల ఈశ్వరరెడ్డి కూడా జై కొట్టడంతో చంద్రబాబుకి భవిష్యత్తులో ఇంకా నిద్ర పట్టదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.   

Read more RELATED
Recommended to you

Latest news