ఓపెన్ ఛాలెంజ్: ఏపీలో మీసం లేకుండా తిరిగేది ఎవరు?

-

ఎప్పుడైనా అధికారంలో ఉన్న పార్టీని ఎన్నికల అనంతరం ప్రతిపక్షంలో కూర్చోబెట్టారంటే.. కచ్చితంగా వారు సుపరిపాలన అందించలేదనే అర్ధం! అది కూడా అతి తక్కువ మార్జిన్ తో ప్రతిపక్షంలో కూర్చుంటే… ప్రజలు మార్పు కోరుకుంటున్నారని సర్ధుకోవచ్చు! అలా కాకుండా మరీ నేలకు తొక్కేస్తే… ఎవ్వరూ ఊహించని స్థాయిలో తీర్పు ఇస్తే..? అప్పుడు మాత్రం కచ్చితంగా ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపించినట్లు లెక్క! ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చనట్లు లెక్క! 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం టీడీపీ పరిస్థితిని ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చేమో!! ఈ క్రమంలో జనాలకు వాస్తవాలు ఇంకా తెలియదనుకుంటారో లేక ప్రస్తుత ప్రభుత్వాలు ఆ వాస్తవాలు ప్రజలకు చెప్పవని భ్రమిస్తారో తెలియదు కానీ… ఇంకా ఆ మాటలే చెబుతుంటారు!

ఇలాంటి ఒక మాట తాజాగా ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమ చెప్పుకొచ్చారు! ఈ క్రమంలో… పోలవరం ప్రాజెక్ట్ తామే 70శాతం పూర్తి చేసేశామని.. ఏపీలో మిగతా ప్రాజెక్ట్ లు కూడా తమ పుణ్యమేనని.. పట్టిసీమ పూర్తి చేసి రాయలసీమకు నీళ్లు ఇచ్చేశామని చెప్పుకొచ్చారు! దీంతో ఏపీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ నిప్పులు చెరిగారు! చంద్రబాబు, దేవినేని ఉమలు తప్పుడు మాటలు చెప్పుకుని బ్రతికే తప్పుడు బ్రతుకులు అంటూ ఘాటుగా విమర్శించారు!

అనంతరం మరింత ఫైరయిన అనీల్ కుమార్… టీడీపీ హయాంలో పోలవరం 70శాతం పూర్తి చేసి ఉంటే, ఆ విషయాన్ని నిరూపించాలని.. అప్పుడు తను మీసం తీసేసి నెల్లూరు రోడ్లపై తిరుగుతానని, అలా నిరూపించలేని పక్షంలో దేవినేని ఉమ మీసం లేకుండా విజయవాడ రోడ్లపై తిరగాలని సవాల్ విసిరారు. తన సొంత జిల్లాకు చెందిన పులిచింతల ప్రాజెక్ట్ లో కూడా నీరు నింపుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉమా మంత్రిగా పనిచేశారని… తాను మాత్రం తన సొంత జిల్లా నెల్లూరులో చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా సోమశిలలో నీళ్లు నిల్వ చేయగలిగామని అనీల్ తెలిపారు.

మరి… అనీల్ కుమార్ అంత నమ్మకంగా, ధైర్యంగా చేసిన ఆ ఛాలెంజ్ కు దేవినేని ఉమ స్పందిస్తారా లేక ఇలా చాటు మాటు కామెంట్లకే పరిమితమయ్యి… పోలవరం విషయంలో తాను చెప్పినవి అసత్యాలని పరోక్షంగా ఒప్పుకుని మౌనం వహిస్తారా అనేది వేచి చూడాలి!

ఆ సంగతులు అలా ఉంటే… తమ హయాంలో ఇరిగేషన్ శాఖ మామూలుగా పనిచేయలేదని చెప్పుకుంటున్న టీడీపీ నేతలు… పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ తో అదనపు నీటిని తీసుకువెళ్లేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై ఇప్పటివరకూ నోరు మెదపకపోవడం గమనార్హం!

Read more RELATED
Recommended to you

Latest news