షేర్ చాట్ ”మ‌ద‌ర్స్ డే” క్యాంపెయిన్‌కు విశేష స్పంద‌న‌..!

-

ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా యాప్ షేర్ చాట్ ”మ‌ద‌ర్స్ డే” సంద‌ర్భంగా నిర్వ‌హించిన క్యాంపెయిన్‌కు యూజ‌ర్ల నుంచి అద్భుత‌మైన స్పంద‌న ల‌భించింది. మే 9 నుంచి 13వ తేదీల మ‌ధ్య ఆ యాప్‌లో ”అమ్మ‌, నేను” అనే క్యాంపెయిన్‌ను నిర్వహించారు. కాగా ఈ క్యాంపెయిన్‌లో పెద్ద ఎత్తున పాల్గొన్న యూజ‌ర్లు అనేక పోస్టుల‌ను షేర్ చేశారు. మాతృమూర్తుల ప‌ట్ల త‌మ‌కున్న అభిమానం, ఆప్యాయ‌త‌, ప్రేమ‌, అనురాగాల‌ను ఇత‌ర యూజ‌ర్ల‌తో పంచుకున్నారు. అమ్మ గొప్ప‌త‌నాన్ని వివ‌రిస్తూ వారు అనేక పోస్టుల‌ను ఆ క్యాంపెయిన్‌లో భాగంగా షేర్ చేశారు.

share chat mothers day campaign got huge response from users

మ‌ద‌ర్స్ డే క్యాంపెయిన్‌లో భాగంగా షేర్ చాట్ యాప్‌లో మొత్తం 20వేల‌కు పైగా యూజ‌ర్ జ‌న‌రేటెడ్ పోస్టులు క్రియేట్ అయ్యాయి. వీటికి గాను 3 కోట్ల వ్యూస్ వ‌చ్చాయి. 2 ల‌క్ష‌ల మందికి పైగా ఈ పోస్టుల‌ను వాట్సాప్‌లో షేర్ చేశారు. ఈ మేర‌కు షేర్ చాట్ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. 5 రోజుల పాటు జ‌రిగిన ఈ క్యాంపెయిన్‌లో యూజ‌ర్లు పెద్ద ఎత్తున పాల్గొన‌డం అభినంద‌నీయ‌మ‌ని షేర్ చాట్ తెలిపింది.

ఇక ఈ క్యాంపెయిన్‌లో భాగంగా యూజ‌ర్లు మాతృమూర్తుల గురించి చేసిన పోస్టులు ఆక‌ట్టుకున్నాయి. అమ్మ‌లు చేసే గొప్ప ప‌నుల గురించి, వారి నిస్వార్థ ప్రేమ గురించి యూజ‌ర్లు పోస్టులు క్రియేట్ చేశారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఇంట్లోని అంద‌రినీ ఎంతో జాగ్ర‌త్త‌గా చూసుకుంటున్న మాతృమూర్తుల‌కు అంకిత‌మిస్తూ షేర్ చాట్ ఈ క్యాంపెయిన్‌ను నిర్వ‌హించింది. ఇక ఈ క్యాంపెయిన్‌ను షేర్ చాట్ మొత్తం 15 భార‌తీయ భాష‌ల్లో నిర్వ‌హించ‌డం విశేషం.

క్యాంపెయిన్‌లో భాగంగా.. ప‌లువురు యూజ‌ర్లు పోస్ట్ చేసిన 3వేల‌కి పైగా వెబ్‌కార్డులు ఆక‌ట్టుకున్నాయి. అలాగే లాక్‌డౌన్ స‌మ‌యంలో మాతృమూర్తులు విశ్రాంతి లేకుండా ఎలా ప‌నిచేస్తున్నారో తెలిపే ఫొటోల‌ను ప‌లువురు యూజ‌ర్లు పోస్ట్ చేసి ఆక‌ట్టుకున్నారు. అదేవిధంగా అమ్మ‌తో 10ఇయ‌ర్స్ పేరిట నిర్వ‌హించిన చాలెంజ్‌లో అనేక మంది పాల్గొని 2వేల‌కు పైగా పోస్టుల‌ను క్రియేట్ చేశారు. వీటికి 3 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ వ‌చ్చిన‌ట్లు షేర్ చాట్ తెలియ‌జేసింది.

Read more RELATED
Recommended to you

Latest news