నర్సీపట్నంలో మళ్లీ వైసీపీకే ఛాన్స్…!

-

తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న నర్సీపట్నంలో ఈసారి వైసీపీ జెండా ఎగురబోతోంది.వరుసగా రెండోసారి వైసీపీ అభ్యర్థి ఉమా శంకర్ గణేష్ గెలవబోతున్నారు. ఇటీవల ఇక్కడ నిర్వహించిన సర్వేలో ఫ్యాన్ పట్ల ఓటర్లు సానుకూలంగా ఉన్నట్లు తేలింది. దీంతో టీడీపీ నేతల్లో ఓటమి భయం పెరిగిపోయింది. ఉమ్మడి విశాఖ జిల్లాలోని నర్సీపట్నం ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో ఉంది. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 15సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం 2,47,816 మంది ఓటర్లు ఉండగా, పురుష ఓటర్లు 1,22,208 మంది కాగా, మహిళా ఓటర్లు 1,25,606 మంది ఉన్నారు.

1955లో తొలిసారి నర్సీపట్నంలో ద్విసభకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఎం పోతురాజు విజయం సాధించారు.1962లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఆర్‌ఎస్‌ఎన్‌ రాజు విజయం సాధించారు. 1962లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ నుంచి పోటీ చేసిన ఆర్‌ లచ్ఛాపాత్రుడు ఇక్కడ గెలిచారు. 1967లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఆర్‌ఎస్‌ఎన్‌ రాజు మరోసారి విజయాన్ని అందుకున్నారు.

1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఆర్‌ఎస్‌ఎన్‌ రాజు,1978లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన గోపాత్రుడు బోలెం విజయం సాధించారు. 1983,1985 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన సీహెచ్‌ అయ్యన్నపాత్రుడు విజయం సాధించారు. 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన సాగి కృష్ణమూర్తిరాజు గెలిచారు. 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన అయ్యన్నపాత్రుడు మరోసారి ఇక్కడ విజయం సాధించారు.

1996 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన వి శ్రీరామ్మూర్తి, 1999లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన అయ్యన్నపాత్రుడు ఇక్కడ విజయం సాధించారు. 2004లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి మరోసారి అయ్యన్నపాత్రుడు గెలుపు అందుకున్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన బి ముత్యాలపాప తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన అయ్యన్నపాత్రుడిపై విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన అయ్యన్నపాత్రుడు మరోసారి ఇక్కడ విజయం సాధించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పెట్ల ఉమా శంకర్‌ గణేస్‌ విజయం సాధించారు.

ఇక్కడ గడిచిన పది ఎన్నికలను పరిశీలిస్తే.. ఆరుసార్లు అయ్యన్నపాత్రుడు విజయం సాధించారు. రానున్న ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అయ్యన్నపాత్రుడు బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీ నుంచి పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ బరిలో ఉన్నారు. అయితే ఈసారి కూడా ఓటర్లు వైసీపీని గెలిపించేందుకు సిద్ధమయ్యారని సర్వేల ద్వారా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news