బ్రేకింగ్: మరో కమిటీ వేసిన ఏపీ సర్కార్

దుర్గగుడి లో వెండి రథంలో మూడు సింహాలు మాయం ఘటనపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై కమిటీ వేసారు. సింహాలు మాయం కాలేదు.. రికార్డులు పరిశీలిస్తామని ఈవో సురేష్ బాబు పేర్కొన్నారు. అంతర్వేది ఘటన జరిగింది కాబట్టి ఇలాంటి ఫేక్ న్యూస్ లు వస్తున్నాయని అంటున్నారు. రికార్డుల పరిశీలన కోసం.మూడు రోజుల సమయం కావాలని అన్నారు. వెండి సింహాలు ఉన్నాయో లేవో చూసి చెప్పడానికి మూడు రోజులు సమయం ఎందుకని ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు.

jagan
jagan

భక్తులు మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి భక్తులు, మీడియా ముందు రథాన్ని చూపించాలని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. ఇది ఇలా ఉంటే వెండి రథం లోని సింహాలు మాయం ఘటనపై కమిటీ వేసిన దేవాదాయశాఖ కమిషనర్ అర్జున్ రావు… ఘటనపై పూర్తి విచారణ చేయాలని రీజనల్ జాయిట్ కమిషనర్ మూర్తిని ఆయన ఆదేశించారు.