యాంటీ రేవంత్ టీం..జంపింగుకు రెడీ?

-

మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న టీం మొత్తం తట్టా బుట్టా సర్దుకుని జంప్ అయ్యే పరిస్తితి వచ్చేసింది. రేవంత్ రెడ్డి పి‌సి‌సి అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి ప్రత్యర్ధి పార్టీల కంటే…సొంత పార్టీ నుంచే విమర్శలు ఎక్కువ ఎదుర్కున్నారు. అసలు రేవంత్ రెడ్డికి పి‌సి‌సి పదవి ఇవ్వడం…సొంత పార్టీలో చాలామంది నేతలకు నచ్చలేదు. వారే రేవంత్ పై విమర్శలు చేసిన పరిస్తితి. అయినా సరే రేవంత్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా…తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు.

యాంటీ వర్గానికి సైలెంట్ గా చెక్ పెడుతూనే..రేవంత్ పనిచేస్తూ వస్తున్నారు. యాంటీ వర్గం ఎన్ని విమర్శలు చేసిన స్పందించలేదు. కానీ వారే పార్టీ నుంచే వెళ్లిపోయేలా రేవంత్ చేస్తున్నారనే వాదనలు కూడా వస్తున్నాయి. ఇక మొదట నుంచి రేవంత్ అంటే పడని కోమటిరెడ్డి బ్రదర్స్…కాంగ్రెస్ పార్టీని వదులుతున్నారు. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి పార్టీని వదిలారు…అటు వెంకటరెడ్డి సైతం పార్టీని వదిలేయోచ్చని ప్రచారం జరుగుతుంది.

ఇక ఇంతకాలం కాంగ్రెస్ లో పనిచేసిన అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ సైతం…కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఖైరతాబాద్ లో తనకు వ్యతిరేకంగా రేవంత్…రోహిన్ రెడ్డిని ఎంకరేజ్ చేయడం…అలాగే విజయారెడ్డిని పార్టీలోకి తీసుకురావడంతోనే శ్రవణ్ కాంగ్రెస్ పార్టీని వదిలారని తెలుస్తోంది. ఈ మధ్య హుస్నాబాద్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డిని కాంగ్రెస్ లోకి తీసుకొచ్చారు. దీంతో అక్కడ పనిచేస్తున్న కాంగ్రెస్ నేత బొమ్మా శ్రీరామ్ చక్రవర్తి…రేవంత్ పై అసంతృప్తితో పార్టీని వీడటానికి రెడీ అవుతున్నారు.

అటు వరంగల్ వెస్ట్ కాంగ్రెస్ లో నాయిని రాజేందర్ రెడ్డి, జంగా రాఘవరెడ్డిలకు చెక్ పెట్టేలా ఎర్రబెల్లి స్వర్ణని రేవంత్ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలా ఎక్కడకక్కడ తన వర్గాన్ని ఎంకరేజ్ చేస్తూ…యాంటీ వర్గానికి రేవంత్ చెక్ పెడుతున్నారు. మరి ఇంకా ఎంతమంది నేతలు…రేవంత్ దెబ్బకు పార్టీని వీడతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news