ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయిన నాటి నుండి వైసిపి పార్టీ కార్యకర్తలు నాయకులు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలపై కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. వైసిపి పార్టీ కార్యకర్తలు నాయకులు చేస్తున్న ఆగడాలకు ప్రతిపక్షంలో ఉన్న పార్టీల కార్యకర్తలు నాయకులు భయాందోళనలకు గురవుతున్నారని వైసీపీ నేతలు పేట్రేగి మరి అధికారం ఉంది కదా అని రెచ్చిపోతున్నారు అని విమర్శించారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు నాయకులు చేస్తున్నా దాడులకు నిరసనగా వైసిపి పార్టీ అధ్యక్షుడు జగన్ సొంత జిల్లా కడపలో త్వరలో బిజెపి పార్టీ తరఫున భారీగా ఆందోళనలు ధర్నాలు చేయబోతున్నట్లు కన్నా లక్ష్మీనారాయణ సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. ముఖ్యంగా కడప జిల్లాలోనే బిజెపి పార్టీ నేతలపై భయంకరంగా వైసీపీ నేతల దాడులు చేసి తిరిగి మళ్ళీ బిజెపి నేతల పైన కేసులు పెడుతున్నారని లక్ష్మీనారాయణ ఫుల్ సీరియస్ అయ్యారు.
ఇసుక దందా ను అడ్డుకున్న బీజేపీ పార్టీ నాయకుడు సత్యనారాయణ రెడ్డి పై వైసీపీ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు అక్రమంగా కేసులు పెట్టారని ఇలాంటి దారుణాలు ఏ ప్రభుత్వం లో చూడ లేదని విమర్శించారు. ఇందువలన ఈనెల 19వ తారీఖున కడప జిల్లాలో భారీగా ధర్నాలు చేయబోతున్నట్లు కన్నా లక్ష్మీనారాయణ సంచలన ప్రకటన చేశారు. దీంతో ఒక పక్క జగన్ ఢిల్లీ లో బిజెపి పార్టీ నాయకులను ఏపీకి మంచి చేసే విధంగా మలుచుకుంటూ అడ్డంకులను రాజకీయ ఎత్తుగడలతో నరుక్కొస్తుంటే…మరోపక్క ఏపీ లో ఉన్న బిజెపి నాయకులు జగన్ సొంత జిల్లాలోనే ఈ ధర్నా లతో భారీ దెబ్బ వేసింది.