విచారణ జరిగితే మీకు ప్రాబ్లం ఏంటీ…? ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్ట్

-

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై నేడు మరోమారు హైకోర్టులో విచారణ జరిగింది. న్యాయామూర్తుల ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది అంటూ హైకోర్టులో పిటిషన్ న్యాయవాది శ్రావణ్ కుమార్ దాఖలు చేసారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని హైకోర్టును న్యాయవాది శ్రావణ్ కుమార్ కోరారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ధర్మాసనం… విచారణ జరిపితే మీకు అభ్యంతరం ఏమిటి అని ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సర్వీస్ ప్రొవైడర్లకు ధర్మాసనం ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై పలుమార్లు విచారణ చేసి వాయిదా వేసింది ధర్మాసనం. ఇక దీనిపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం కూడా చెలరేగింది. ప్రధాని నరేంద్ర మోడీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ కూడా రాసారు. దేశ భద్రతకు ముప్పు ఉంది అంటూ ప్రధాని దృష్టికి ఆయన తీసుకుని వెళ్ళారు.

Read more RELATED
Recommended to you

Latest news