పేకాట ఆడితే ఏమవుద్ది…? కొడాలి నానీ సంచలన వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి అదేశాలమేరకు పేకాట శిబిరాలపై దాడులు చేసి పట్టుకున్నారు అని మంత్రి కొడాలి నానీ అన్నారు. సిఎం జగన్ ని కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. నేను ఆడిస్తే మా పోలీస్ లు పట్టుకుంటారా అని ప్రశ్నించారు. కొనకళ్ల నారాయణ, దేవినేని ఉమ లు గతంలో పేకాట ఆడించేవారు అని, ఎస్ ఈ బి వాళ్ళు కు ముఖ్యమంత్రి పూర్తి స్వేచ్చ ఇచ్చారని నానీ అన్నారు.

kodali nani

పేకాడే వాళ్లకు పార్టీ లు ఉంటాయా అని ప్రశ్నించారు. మా నియోజకవర్గం లో పేకాట క్లబ్ లు మూయించింది మేము అని అన్నారు. మాకు దమ్ము ధైర్యం ఉంది కనుక పేకాట సిబిరాలపై దాడులు చేయించాము అని, మాకున్న సమాచారం ప్రకారం అక్కడ ఎవ్వరు పేకాట అడడం లేదు కార్ లు వద్ద కూర్చున్నారు అని ఆయన పేర్కొన్నారు. ఒక సెట్ రెండు సెట్ ల పేకలు వారి కార్ లలో దొరికాయి అని ఆయన వివరించారు.

వెహికల్స్ అక్కడ పెట్టి ఎక్కడెక్కడికో వెళ్లి అడుతారు అని, పేకడుతున్నట్టు కేస్ లు పెట్టాం. పట్టుకున్న వాళ్ల పై విచారణ జరుపుతాము అని స్పష్టం చేసారు. ఉంటే నా అనుచరులు ఉంటారు… నా తమ్ముడే ఉంటాడు…అయితే వాళ్ళను తప్పించమని నేను కాంప్ ఆఫీస్ కి రావాలా అని ఆయన ప్రశ్నించారు. పేకాటకు ఉరిశిక్ష ఏమైనా ఉంటుందా అని ప్రశ్నించారు. 50 రూపాయలు ఫైన్ వేస్తారు అని, నా పర్సనల్ పని ఇప్పటి వరకు ఒక్కటి కూడా సీఎం ను అడగలేదు అని స్పష్టం చేసారు.