చూస్తూ ఊరుకోం… ఈనాడుకి ఏపీ మంత్రి వార్నింగ్!

-

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏమాత్రం పడని పత్రికల్లో ఈనాడు ఒకటి అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనేది… గత ఎన్నికల్లో వచ్చిన కథనాలను బట్టి ఇట్టే చెప్పొచ్చు! జగన్ పాదయాత్రకు ఈనాడు ఇచ్చిన కవరేజీ ఎంత తక్కువగా ఉండేది అనేది మరో ఉదాహరణ! ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా… టీడీపీ కంటే భారీస్థాయిలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది ఈనాడు! ప్రజాస్వామ్యంలో పత్రికలు ఎప్పుడూ ప్రతిపక్ష పాత్ర పోషించాలనేది నిజమే అయినా… అది అన్ని సందర్భాల్లోనూ ఉండాలి! తాను కాంగ్రెస్ కు వ్యతిరేకి అని ఎప్పుడో ప్రకటించిన ఆ పత్రిక ఎడిటర్ రామోజీ పాటించే “ప్రతిపక్ష పాత్ర”వల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని కూడా కామెంట్లు వినిపిస్తుంటాయి! ఈ క్రమంలో అలాంటి పద్దతిలో భాగంగా ప్రచురించిన ఒక వార్తపై ఫైరయ్యారు ఏపీ మంత్రి కన్నబాబు!

గతంలో ఈనాడు జర్నలిస్టుగా పనిచేసి.. ప్రస్తుతం ఏపీలో వ్యవసాయమంత్రిగా ఉన్న కన్నబాబు… ప్రముఖ దినపత్రిక ఈనాడు, వార్తలను వక్రీకరించి రాస్తోందని మండిపడ్డారు. “అరటి పండ్లు కొనేవారు లేక…” అంటూ తాజాగా ఈనాడు రాసిన వార్తను ఆయన తప్పుబట్టారు. పాత ఫోటోలతో ఆ వార్త రాశారని.. ఈనాడులో వచ్చిన కథనం చూసి తాము కేదారేశ్వరపేట మార్కెట్ కు వెళితే అక్కడ అసలు అలాంటి పరిస్థితే లేదని మంత్రి తెలిపారు! ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడమే పనిగా పెట్టుకున్న కొన్ని పత్రికలు… అవాస్తవాలు ప్రచురించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయ్యని అన్నారు. ఈ క్రమంలో… ఇకపై ఇలాంటి పచ్చి అబద్ధాలు ప్రచురించే పనిని కొనసాగిస్తే మాత్రం… ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని కన్నబాబు తీవ్రంగా హెచ్చరించారు!

ఇదే సమయంలో ఈనాడుపై మరిన్ని ప్రశ్నలు సంధించారు కురసాల కన్నబాబు! ఎందుకు ఇలా వక్రీకరణ చేసి వార్తలు రాస్తున్నారని… ఎవరి ప్రయోజనం కోసం ఇలా రాస్తున్నారని… వాస్తవాలు తెలుసుకోకుండా వార్తలు రాయడం ఏమిటని… మంత్రి తనదైన పద్దతిలో తీవ్రంగా ప్రశ్నించారు! రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వమే అరటిని కొనుగోలు చేస్తుందని… ఇతర దేశాలకు ఎగుమతులు లేకపోవడం వల్లనే ధరలు కాస్త తగ్గాయని… రాయలసీమ ప్రాంతంలో పండిన అరటిని ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లకు తరలిస్తున్నామని కన్నబాబు తెలిపారు!

Read more RELATED
Recommended to you

Latest news