రాజీనామా చేస్తామన్న ఏపీ మంత్రులు…!

-

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు తీర్మానం రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం నేపధ్యంలో ఎమ్మెల్సీలుగా కేబినేట్ లో ఉన్న మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్ చంద్రబోసు రాజీనామా చేసే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా జరిగింది. తన నిర్ణయానికి ఎక్కువగా కట్టుబడి ఉండే ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులు ఇద్దరినీ రాజీనామా చేయించే అవకాశం ఉందనే ప్రచారం ఇప్పుడు జరుగుతుంది.

వాళ్ళు రాజీనామా చేస్తే కచ్చితంగా జగన్ నిర్ణయాన్ని అందరూ భేష్ అంటారు. అటు వైసీపీ కార్యకర్తల నుంచి కూడా ఈ డిమాండ్ ఎక్కువగా వినపడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మోపిదేవి వెంకటరమణ కీలక వ్యాఖ్యలు చేసారు. బుధవారం మోపిదేవి అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఖచ్చితంగా రాజీనామా చేస్తామని ఆయన స్పష్టం చేసారు. అయితే రాజీనామాలకు కొన్ని పద్ధతులు ఉంటాయన్నారు.

మండలి రద్దుపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. కేంద్రం నుంచి సమాచారం వచ్చిన వెంటనే రాజీనామా చేస్తామని స్పష్టం చేసారు. టీడీపీ నేతలు డిమాండ్ చేసినంత మాత్రాన మంత్రి పదవులకు రాజీనామా చేయలేమని, దానికి నియమ నిబంధనలు ఉంటాయని ఆయన న్నారు. మంత్రులు ఇద్దరూ పదవులకు రాజీనామా చేసినా వారికి తాము అండగా ఉంటామని సీఎం జగన్ ఇటీవల స్పష్టమైన హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news