బూతులు తిట్టొద్దు కంట్రోల్ చేస్కోండి అని
ఏ రోజయినా గౌరవ సీఎం జగన్ చెప్పారా?
అబ్బా ! పాత ముఖాలు అన్నీ ఇంటికి వెళ్తాయి అని అనుకుంటే నలుగురిని రిపీట్ మోడ్ లో ఉంచారు జగన్. ఆ కోవలో ఆ తోవలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి సీదిరి అప్పల్రాజు ఉన్నారు. ఈయన పలాస నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజకీయాల్లో చాలా అంటే చాలా జూనియర్. కానీ మాటల్లో మాత్రం కేసీఆర్ ను ఇమిటేట్ చేస్తారు. ఆవేశంతో ఊగిపోతారు. జగన్ వీర విధేయుడు కూడా ! వీలుంటే ఆయన ప్రత్యర్థి అయిన గౌతు శిరీష (మాజీ ఎమ్మెల్యే శివాజీ కుమార్తె) ను మాత్రం తిట్టించగలరు. తిట్టగలరు. మహిళ అని చూడకండి అని కార్యకర్తలకు నిర్దేశించనూ గలరు.ఇవన్నీ టీడీపీ ఆయనపై చేసే ఆరోపణలు. ఆయనెలా ఉన్నా జగన్ విధేయుడు కనుక బాగా అంటే బాగా కాలం కలిసివచ్చింది కనుక ఇకపై కూడా ఆయనే మంత్రి.
నానీ పోయె జోగి వచ్చే…
ఢాం ఢాం ఢాం…..ఇదేలా తరతరాల చరితం
జగన్ విడుదల చేసే తరువాత జాబితాలో మరో పేరు విన వస్తుంది. అదే పెడన నియోజకవర్గం (ఉమ్మడి కృష్ణా జిల్లా) నుంచి ఎన్నికైన జోగి రమేశ్. ఈయనే ఇప్పుడు మరో బూతుల మంత్రిగా రానున్నారు. జగన్ పై ఉన్న ప్రేమతో శత్రు మూకలను నోటికి వచ్చిన విధంగా తిట్టగలరు. క్యాబినెట్ లో పేర్నినాని లేకపోయినా సరే వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి హోదాలో ఈ మాజీ మంత్రి కూడా త్వరలోనే చంద్రబాబును మిగతా వాళ్లను బూతులు తిట్టనున్నారు.
మళ్లీ పదవులు వస్తే
మళ్లీ రెచ్చిపోతారు ఇది ఫిక్స్ భయ్యా !
కొడాలి నాని కూడా అందుకు సిద్ధంగానే ఉన్నారు.వీళ్లంతా మరో సారి కూడా గెలుస్తారని వార్తలు వస్తున్నాయి.వీరికి 2024 లో ఫస్ట్ హాఫ్ లో మళ్లీ పదవులు వస్తాయి. ఎందుకంటే
వీళ్లకు ఉన్నంత మీడియా అటెన్షన్ జగన్ కు కూడా లేదు. కనుక చంద్రబాబును ఇప్పుడు నేరుగా జగన్ తిట్టడం కూడా స్టార్ట్ అయింది కనుక ఆయనకు తోడుగా వీళ్లు కూడా ఉండనున్నారు అని తేలిపోయింది.