వాళ్ళు ప్రతిపక్ష నాయకులు కాదు కానీ ..  జగన్ పేరు చెప్తే వాళ్ళు దడదడ లాడిపోతున్నారు !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కింద స్థాయి నుండి పై స్థాయి వరకు ఎక్కడా కూడా అవినీతి లేకుండా సుపరిపాలన అందిస్తానని ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసే రోజే జగన్ ప్రకటించడం జరిగింది. ఇదే తరుణంలో ప్రభుత్వ  అన్ని శాఖలలో ఎక్కడా కూడా అవినీతి లేకుండా జగన్ జాగ్రత్తలు తీసుకుంటేనే వస్తున్నారు. కాగా సింగం లాంటి పోలీస్ ఆఫీసర్ పేరు కలిగిన ఐపీఎస్ సీతారామాంజనేయులను ఏరికోరి మరీ తన క్యాడర్ లోకి తీసుకుని రవాణాశాఖ కమిషనర్, ఆర్టీసీ ఎండీ పోస్టులను కట్టబెట్టారు. జగన్ ఇచ్చిన బాధ్యతలను అద్భుతంగా నిర్వర్తించిన సీతారామాంజనేయులు ఆయా శాఖల లో ఎక్కడా కూడా అవినీతి లేకుండా చేశారు. ప్రయివేటు ట్రావెల్స్ దందాని కట్టడి చేశారు.

Image result for jagan"

ఏకంగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడి నుంచి కూడా రివకరీ చేయగలిగారు. జేసీ దివాకరరెడ్డి వంటి నాయకుడికి ఎదురెళ్లి నిలిచారు. దీంతో ఆయన పనితీరు నచ్చి జగన్ ఏకంగా ఆయనకు ఏసీబీ డీజీగా నియమించారు. ఇటువంటి నేపథ్యంలో ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కొంతమంది ప్రభుత్వానికి సంబంధించిన అధికారుల పేర్లు జగన్ దృష్టికి ఇటీవల వచ్చాయట.

దీంతో ఈ విషయం ఆయా ప్రభుత్వ అధికారులకు తెలియటంతో జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అన్న టెన్షన్ నెలకొన్నట్లు సమాచారం. లిస్ట్ లో ఎక్కువమంది పేర్లు బయటపడటంతో సీఎం జగన్…ఏసీబీ చీఫ్ సీతారామాంజనేయులునీ  25 ఏసీబీ బృందాలు వెంటబెట్టుకుని మొత్తం అవినీతి బాగోతం అంతా బయట పెట్టాలి అని హెచ్చరించారట. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు దాడులు చేయడం మొదలుపెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news