ఆ మాజీమంత్రి చేస్తున్న ప‌నులు టీడీపీని ఇబ్బందుల్లో ప‌డేస్తున్నాయా..

ఏపీ రాజ‌కీయాల్లో టీడీపీ ఇప్పుడు ఎక్క‌డ ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టికే నానా ఇబ్బందులు ప‌డుతూ కొట్టుమిట్టాడుతోంది. దీంతో పార్టీ అస‌లు రాబోయే కాలంలో ఎలా ఉంటుందో అని ఆందోళ‌న ప‌డుతున్నారు. ఇక ఇలాంటి త‌రుణంలో కూడా పార్టీలో కొంద‌రు చేస్తున్న ప‌ని తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. ఇంకా చెప్పాలంటే బ‌య‌టి పోరు కంటే కూడా ఇంటిపోరే ఎక్కువ‌గా ఉండ‌టం పెద‌ద్ మైన‌స్ అనే చెప్పాలి. కాగా ఇప్ప‌టికే ఎన్నో అడ్డంకుల‌తో పార్టీని న‌డిపించేందుకు నారా చంద్ర‌బాబునాయుడు ఎన్నో ఇబ్బందులు ప‌డుతున్నారు.

TDP
TDP

కానీ ఆయ‌న‌కు ఎవ‌రూ కూడా స‌పోర్టు ఇవ్వ‌డ‌మేమో గానీ ఇంకా ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్ప‌టికే పార్టీలో ఒక‌రి మీద ఒక‌రు చంద్ర‌బాబుకు కంప్ల‌యింట్లు చేసుకుంటూ పార్టీని ఇర‌కాటంలో పెట్ట‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు అనంతపురం జిల్లా కు చెందిన మాజీ మంత్రి చేస్తున్న పనులు టీడీపీని తీవ్ర ఇబ్బందుల‌కు గురిచేస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో జ‌రిగిన న‌ష్టం నుంచే ఈ జిల్లాలో ఇంకా పార్టీ కోలుకోలేక పోతోంది.

ఇక ఇలాంటి త‌రుణంలో పార్టీని ముందుండిన‌డిపించాల్సిన టీడీపీ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వ్యవహరిస్తున్న తీరు టీడీపీ త‌మ్ముళ్ల‌కు తీవ్ర ఆగ్ర‌హం తెప్పిస్తోంది. ఇక రీసెంట్ గా ఆయన తాడిపత్రి ప్ర‌స్తుత వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితోభేటీ కావ‌డం సంచ‌ల‌నం రేపుతోంది. ఆయ‌న ఇంట్లోకి వెళ్లి ఏకంగా ఆయ‌న‌తో క‌లిసి టిఫిన్ చేయ‌డంతో ఆయ‌న పార్టీ మారుతున్నారా అంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక ఇందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. ఇప్ప‌టికే పార్టీ చిక్కుల్లో ఉందంటే మీరు ఇలాంటి ప‌నుల‌తో మ‌రింత దిగ‌జారుస్తున్నారంటూ ఆయ‌న‌పై కార్య‌క‌ర్త‌లు దుమ్మెత్త్తిపోస్తున్నారు.