టీడీపీ లో కొత్త బుచ్చయ్యలు… బుజ్జగింపులకు కండిషన్స్ అప్లై!

టీడీపీలో ప్రస్తుతం నాయకుల మధ్య సఖ్యత కరువైందా.. అంతర్గత ఆధిపత్యపోరుకు తెర లేచిందా.. పార్టీని ఎలా బ్రతికించుకోవాలనే అంశాన్ని వదిలి, పనికిరాని పంతాలకు పోతున్నారా.. కలిసిరాని పట్టింపులకు వెళ్తున్నారా.. అంటే, అవుననే సమాధానాలు వస్తున్నాయి! ఈ విషయంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి మొన్న స్పందించగా.. నిన్న, జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. కానీ.. బుచ్చయ్యకున్నట్లు బుజ్జగింపులు మాత్రం జేసీకి లేవు సరికదా.. ఫుల్ వాయింపులైతే మొదలైపోయాయి!

TDP Party | తెలుగుదేశం పార్టీ
TDP Party | తెలుగుదేశం పార్టీ

“పార్టీలో నాయకులంతా స్తబ్ధగా ఉన్నారు.. కార్యకర్తలను గాలికొదిలేశారు.. కార్యకర్తల్లో కదలికలు తీసుకొచ్చే విషయంలో అధినేత చంద్రబాబు అలసత్వం వహిస్తున్నారు. తనదైన అర్థజ్ఞానంతో చినబాబు ఒంటెద్దు పోకడలకు పోతున్నారు”… మొన్న బుచ్చయ్య చెప్పినా, నిన్న జేసీ అరిచి మరీ చెప్పినా… ఫైనల్ విషయం అయితే ఇదే.. వారి ఆవేదనకు అర్థం అదే!

మరి ఈ విషయంలో “గోరంట్ల బుచ్చయ్య చౌదరి”ని పిలిచి మాట్లాడి బుజ్జగించిన చంద్రబాబు.. “జేసీ ప్రభాకర్ రెడ్డి”పై మాత్రం మిగిలిన నేతలతో ఎందుకు తిట్టిస్తున్నారు? ఈ విధానాలే ప్రస్తుతం చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ పరిస్థితికి కారణమయ్యింది! నాయకులను కలుపుకుపోవడంలేదు.. కార్యకర్తలను కదిలించేపనులు చేయడం లేదు.. అనే విమర్శలకు రోజు రోజుకీ టీడీపీలో బలం పెరిగిపోతుంది.

బుచ్చయ్య రూపంలో వచ్చిన రియాక్షన్.. ఇప్పుడు జేసీ వరకూ చేరింది. రాబోయే కాలంలో ఇలాంటి బుచ్చయ్య ప్రభావం పనిచేసే నేతలు చాలామందే పుట్టుకొచ్చే అవకాశం లేకపోలేదు. మరి చంద్రబాబు ఇప్పటికైనా పద్దతి మార్చుకుంటారా లేక కొత్త బుచ్చయ్యలు పుట్టుకురావడానికి సహకరిస్తారా అన్నది వేచి చూడాలి! ఇక్కడ కొత్తగా పుట్టుకురాబోయే బుచ్చయ్యలు మాత్రం… బాబు నుంచి బుజ్జగింపులు ఆశించే విషయంలో కండిషన్స్ అప్ప్లై అవుతాయ్యన విషయం మరిచిపోకూడదు.

ఆ కండిషన్స్ కులప్రాతిపధికన ఉంటాయా.. ఓటర్లపై ఆ నాయకుడి ప్రభావంపై ఆధారపడి ఉంటాయా.. ప్రాంతాన్ని బట్టి ఉంటాయా.. సీనియారిటీని బట్టీ ఉంటాయా అనే విషయంలో… ఎవరి అవగాహన వారిదే!!