మానకొండూరులో రసమయికి ఆరేపల్లితో చిక్కులు..సీటు ఎవరికి?

-

వచ్చే ఎన్నికల్లో ఎంతమంది బి‌ఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీట్లు కోల్పోతారు? అంటే 10-20 వరకు అని ఆ పార్టీలో చర్చ నడుస్తుంది. పనితీరు సరిగ్గా లేని, ఓటమి దిశగా వెళుతున్న ఎమ్మెల్యేలని పక్కన పెట్టి ఆ స్థానాల్లో కొత్త అభ్యర్ధులని బరిలో దించడానికి కే‌సి‌ఆర్ సిద్ధమవుతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే అభ్యర్ధుల విషయంలో తీవ్రంగా కసరత్తు చేస్తున్నారని, ఆగష్టులోనే మొదట లిస్ట్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

ఈ క్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణన్ విషయంలో కాస్త కన్ఫ్యూజన్ ఉన్నట్లు తెలిసింది. రసమయికి ఈ సారి సీటు డౌటే అనే చర్చ ఎక్కువ సాగుతుంది. ఆయన స్థానంలో ఆరేపల్లి మోహన్‌కు సీటు ఇస్తారని టాక్ వస్తుంది. 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మానకొండూరు సీటు ఏర్పడింది. 2009 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఆరేపల్లి మోహన్ విజయం సాధించారు. ఇక తెలంగాణ వచ్చాక బి‌ఆర్‌ఎస్ నుంచి రసమయి, కాంగ్రెస్ నుంచి ఆరేపల్లి పోటీ చేశారు. విజయం రసమయిని వరించింది.

ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా బాగానే పనిచేశారు. అందుకే 2018 ఎన్నికల్లో మరొకసారి మంచి మెజారిటీతో గెలిచారు. అప్పుడు కాంగ్రెస్ నుంచి ఆరేపల్లి పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఓడిన తర్వాత ఆరేపల్లి బి‌ఆర్‌ఎస్ లోకి జంప్ చేశారు. ఇక్కడే అసలు సమస్య వచ్చింది. సీటు కోసం రసమయి, ఆరేపల్లి మధ్య పోటీ నెలకొంది.

ఈ సారి ఎమ్మెల్యేగా రసమయికి పెద్దగా మంచి మార్కులు పడుతున్నట్లు కనిపించడం లేదు.  నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం, ప్రభుత్వం సంక్షేమ పథకాలు.. రసమయికి కలిసొచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. కానీ.. దళితబంధు, డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ పెండింగ్‌లో ఉండటం, కొన్ని ప్రాంతాల్లో సరైన అభివృద్ధి లేకపోవడం మైనస్. ఇటు ఆరేపల్లికి నియోజకవర్గంలో బలమైన వర్గం ఉంది.

ఇక ఇద్దరి బలాబలాలని అంచనా వేసుకుంటున్న బి‌ఆర్‌ఎస్ అధిష్టానం…ఆరేపల్లి వైపు మొగ్గు చూపిన ఆశ్చర్యం అవసరం లేదని తెలుస్తుంది. లేదా సెంటిమెంట్ తో రసమయికి మళ్ళీ సీటు ఇచ్చే ఛాన్స్ ఉంది. అలా చేస్తే ఆరేపల్లి మళ్ళీ కాంగ్రెస్ లోకి జంప్ చేసి పోటీ చేయవచ్చు. అటు కాంగ్రెస్ నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ ఉన్నారు..బి‌జే‌పి నుంచి గడ్డం నాగరాజు, దరువు ఎల్లన్న సీటు కోసం ట్రై చేస్తున్నారు. అయితే పోటీ బి‌ఆర్‌ఎస్-కాంగ్రెస్ మధ్య ఉంటుంది. బి‌ఆర్‌ఎస్ లో సీటు ఎవరికి ఇస్తారనే దాని బట్టి గెలుపోటములు డిసైడ్ అవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news