ఉమ్మడి నల్గొండ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట..ఇప్పుడు బిఆర్‌ఎస్ అడ్డా. ఊహించని విధంగా జిల్లాలోని మొత్తం 12 స్థానాలు బిఆర్‌ఎస్ చేతిలోనే ఉన్నాయి. గత ఎన్నికల్లో 12 సీట్లకు బిఆర్‌ఎస్ 9, కాంగ్రెస్ 3 సీట్లు గెలుచుకుంది. కానీ అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీగా గెలవడంతో హుజూర్‌నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దానికి ఉపఎన్నిక వస్తే బిఆర్‌ఎస్ గెలిచింది. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బిఆర్‌ఎస్ లోకి వెళ్లారు.
మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ బిజేపిలోకి వెళ్లారు. దీంతో మునుగోడు ఉపఎన్నికలో బిఆర్‌ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచారు. ఇలా మూడు సీట్లు కూడా బిఆర్‌ఎస్ వైపుకు వెళ్ళాయి. దీంతో మొత్తం బిఆర్‌ఎస్ చేతిలో ఉంది. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో పనితీరు సరిగ్గా లేని ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వనని కేసిఆర్ చెప్పేశారు. అలాగే కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం బట్టి మార్పులు చేసే ఛాన్స్ ఉంది.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..నల్గొండలో దాదాపు సిట్టింగులకు సీట్లు ఖాయమే. కానీ ఇటీవల ఉపఎన్నికలో గెలిచిన మునుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డికి మళ్ళీ సీటు ఇవ్వడం లేదని తెలిసింది. ఇక్కడ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డికి లేదా..కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతిని తీసుకుని సీటు ఇచ్చే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తుంది. స్రవంతి ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నారు. మరి ఆమెకు కాంగ్రెస్ లో సీటు లేదని అంటున్నారు.కాంగ్రెస్ నుంచి చల్లమల్ల కృష్ణారెడ్డి పోటీ చేస్తారని టాక్. అంటే మునుగోడులో మార్పు ఖాయం.
ఇటీవలే భువనగిరిలో కాంగ్రెస్ నేత అనిల్ రెడ్డి బిఆర్‌ఎస్ లోకి వచ్చారు. దీంతో బిఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఫైళ్ళ శేఖర్ రెడ్డికి సీటు టెన్షన్ మొదలైంది. అక్కడ బిజేపి నుంచి జిట్టా బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్ళి పోటీ చేసే ఛాన్స్ ఉంది. లేదా కాంగ్రెస్ సీటు రామాంజనేయులు గౌడ్‌కు దక్కే అవకాశాలు ఉన్నాయి.
ఇటు ఆలేరు సీటులో భారీ ట్విస్ట్ ఛాన్స్ ఉంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గొంగిడి సునీతకు సీటు డౌటే. అక్కడ మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్‌కు ఛాన్స్ ఇస్తారని టాక్. గతంలో ఈయన 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2014, 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. నెక్స్ట్ బిజేపిలోకి వెళ్లారు.అటు నుంచి బిఆర్‌ఎస్ లోకి వచ్చారు. ఈ మూడు సీట్లతో పాటు హుజూర్‌నగర్ లో మార్పుకు ఛాన్స్ ఉంది. కానీ క్లారిటీ లేదు.