#AskMe.. ప్రధాని మోదీని ప్రశ్నలడిగే అవకాశం మీకు కూడా..!

-

దేశంలో ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. ఎక్కడ చూసినా లోక్ సభ ఎన్నికల గురించే చర్చ. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? కాబోయే ప్రధాని ఎవరు. అసలు ఐదేళ్లలో మోదీ ఏం చేశారు? ఆయన దేశానికి చేసిందేంటి?


లాంటి ఎన్నో ప్రశ్నలు.. ఎన్నో సందేహాలు అందరి మదిలో మెదులుతుంటాయి. అయితే.. దేశ ప్రజలకు ప్రధాని మోదీని ప్రశ్నలడిగే ఒక అవకాశం వచ్చింది.టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ ప్రధాని మోదీని ఇంటర్వ్యూ చేయబోతోంది. ఆ ఇంటర్వ్యూలో మీరు అడిగిన ప్రశ్నలను టైమ్స్ ప్రతినిధి మీ తరుపున మోదీని అడుగుతారు.



దాని కోసం మీరు askpm@timesinternet.in మెయిల్ ఐడీకి మీ ప్రశ్నను మెయిల్ చేయడమే. మీ ప్రశ్నకు మోదీయే డైరెక్ట్‌గా సమాధానం ఇచ్చే మంచి అవకాశాన్ని వదులుకోకండి. వెంటనే మీ మెదడుకు పదును పెట్టి.. మోదీకి సంక్లిష్ట ప్రశ్నలు వేసి ఉక్కిరి బిక్కిరి చేసేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version