విజయసాయి కామెడిగా మాట్లాడారు…!

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు తీవ్ర విమర్శలు చేసారు. పవిత్రమైన రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి న్యాయవ్యవస్థను విమర్శిస్తూ మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందని ఆయన ఆరోపించారు. పెద్దల సభలో ఒక దొంగ మాట్లాడడం బాధాకరమని ఆవేదనగా మాట్లాడారు.

అలాంటిది, మా ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకతతో, పక్షపాతంతో కోర్టులు వ్యవహరిస్తున్నాయని, దీని వలన ఇబ్బందులు పడుతున్నామని విజయసాయిరెడ్డి అనడం ఇంకా విడ్డూరమని అన్నారు. న్యాయ వ్యవస్థలు దొంగలను శిక్షిస్తాయి, కానీ ఒక దొంగ న్యాయవ్యవస్థను విమర్శించడం ఎంత వరకు సమంజసం విజయసాయి రెడ్డి గారని అని ప్రశ్నించారు.