మెగాస్టార్‌పై బాబుమోహ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు: చిరంజీవా… గిరంజీవా..

-

టాలీవుడ్ సీనియ‌ర్ క‌మెడియ‌న్‌, మాజీ మంత్రి బాబుమోహ‌న్ మెగాస్టార్ చిరంజీవిని కించ‌ప‌రిచిన‌ట్టు చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. అయితే బాబు మోహ‌న్ చిరంజీవిని కావాల‌ని కించ‌ప‌ర‌చ‌పోయినా ఇప్పుడు ఆ వీడియో మాత్రం బాగా వైర‌ల్ అవ్వ‌డంతో బాబుమోహ‌న్ చిక్కుల్లో ప‌డ్డారు. ఒక హీరోని పొగిడే క్రమంలో సాటి హీరోని కించపరిచారు ఆయన.

బాబుమోహ‌న్ త‌న తాజా ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ భైరవద్వీపం షూటింగ్ రోజుల్ని గుర్తుచేసుకున్న ఆయ‌న ఆ సినిమా హీరో బాల‌కృష్ణ‌పై  ప్ర‌శంస‌లు కురిపించారు. బాల‌య్య హార్స్ రైడింగ్ స్కిల్స్ ని విపరీతంగా పొగిడేశారు. బాలకృష్ణ గుర్రపు స్వారీ చేయాల్సి వస్తే అస్సలు రోప్ అవసరమే ఉండదంటూనే అనుకోకుండా మెగాస్టార్ చిరంజీవిని కూడా ఇందులోకి లాగేశారు.

భైర‌వ‌ద్వీపంలో బాల‌కృష్ణ‌…. తాను గుర్రాల‌పైకి వెళ్లామ‌ని…. బాల‌య్య గుర్రం న‌డ‌ప‌డంలో మొన‌గాడు… గుర్రాల‌తో ఆడ‌తాడు… దూకుతుంటాడు… నిజంగా బాలకృష్ణలా చిరంజీవి గిరంజీవి ఎవ్వరూ గుర్రం నడప జాలరు… అసలు ఏం పట్టుకోకుండా .. ఇలా జూలు పట్టుకుని పోతుంటాడ‌ని బాబుమోహ‌న్ ఆ వీడియోలో చెప్పారు.

ఇక ఈ వీడియోను అటు బాల‌య్య అభిమానులు విప‌రీతంగా వైర‌ల్ చేస్తున్నారు. బాబుమోహ‌న్ కావాల‌ని అన‌క‌పోయినా బాల‌య్య ఫ్యాన్స్ దానిని బాగా వైర‌ల్ చేస్తుంటే… ఆయ‌న‌పై మెగా అభిమానులు మాత్రం ఇలా ఎందుకు మాట్లాడాలంటూ మండిప‌డుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news