సీఎం చంద్రబాబును కలిసిన మాజీ మంత్రి.. పార్టీలో చేరతారంటూ ఊహాగానాలు..

-

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. ఇప్పటివరకు ఉన్న టిడిపి కమిటీలను రద్దు చేసిన ఆయన.. సభ్యత్వాలు పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలంటూ ఆదేశాలు జారీ చేశారు.. పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తానని.. కీలక నేతలతో జరిగిన సమావేశంలో ఆయన అన్నారట.. గ్రామాల్లో ఉన్న బలమైన కేడర్ను దగ్గరకు తీసుకుని పార్టీ కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారట..

తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే క్రమంలో.. పార్టీ నుంచి వెళ్లిపోయిన నేతలు చంద్రబాబుకు టచ్ లోకి వస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.. తెలంగాణలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీలో చేరేందుకు చాలామంది మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ప్రయత్నాలు ముమ్మరం చేశారనే ప్రచారం నడుస్తోంది.
ఈ క్రమంలోనే మాజీ మంత్రి బాబూమోహన్ చంద్రబాబుని కలిశారు.. దింతో ఆయన టిడిపిలో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు బిజెపిలో ఉన్న ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి ప్రజాశాంతి పార్టీలో చేరారు.. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న బాబు మోహన్.. టిడిపిలో చేరడం ఖాయమనే టాక్ టిడిపి వర్గాల నుంచి వినిపిస్తుంది..

గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా బాబు మోహన్ గెలిచారు.. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పలు పార్టీలు మారారు.. చివరికి సొంత గూటికి వచ్చేందుకే చంద్రబాబును కలిశారని ఆయన శిబిరం నేతలు చెబుతున్నారు.. పోగొట్టుకున్న చోటే.. రాబట్టుకోవాలి అనే సిద్ధాంతంలో చంద్రబాబు ఉన్నారట.. తెలంగాణలో పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసి.. ఇక్కడ కూడా అధికారంలోకి రావాలనే వ్యూహాలు రచిస్తున్నారని తెలంగాణ టిడిపి నేతలు చర్చించుకుంటున్నారు.. ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో.. తెలంగాణలో ఉన్న కీలక నేతలు టిడిపి వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news