కేసీఆర్‌పై బాబుమోహ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. అడుగ‌డుగునా అవ‌మానాలేనంట‌!

బాబు మోహ‌న్ అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఆయ‌న సినిమాల్లో న‌టించి ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఆ త‌ర్వాత రాజ‌కీయాల్లోకి వ‌చ్చి సెటిల్ అయ్యారు. అయితే త‌న‌కు కేసీఆర్‌తో 40ఏండ్ల స్నేహం ఉంద‌ని, కానీ ఆయ‌న ద‌గ్గ‌ర త‌న‌కు ఎన్నో అవ‌మానాలు జ‌రిగాయ‌ని ఆవేద‌న చెందారు. రీసెంట్‌గా ఆయ‌న త‌న‌కు గ‌తంలో ఎదురైన అవ‌మానాల‌ను వెల్ల‌డించారు.

2018లో తాను టీఆర్ ఎస్ టికెట్ కోసం ప్ర‌య‌త్నించినా దక్కలేద‌న్నారు. అయితే ఎన్నిక‌ల‌కు ముందే త‌న‌ను పార్టీ నుంచి దూరం పెట్ట‌డంతో కేసీఆర్ క‌లిసేందుకు అపాయింట్ మెంట్ కోసం ఎన్నోసార్లు ట్రై చేసినా దొరకలేదన్నారు. కొన్ని వంద‌ల సార్లు కేసీఆర్ కు ఫోన్ చేసినా క‌నీసం మాట్లాడ‌లేద‌ని ఆవేద‌న వెల్ల‌డించారు.

ఆ త‌ర్వాత కూడా కేసీఆర్‌ను క‌లిసేందుకు ఎన‌నోసార్లు ప్ర‌య‌త్నించాన‌ని చెప్పారు. దాదాపు వారం రోజుల వ‌ర‌కు కేసీఆర్ అపాయింట్ మెంట్ వెయిట్ చేశాన‌ని, కానీ దొర‌క‌లేద‌న్నారు. అందుకే చివ‌ర‌కు బీజేపీలో చేరానని ఈ సంద‌ర్భంగా తెలిపారు. త‌న‌లాగే ఉద్య‌మ‌కారుల‌కు టీఆర్ ఎస్‌లో గౌర‌వం లేకుండా పోయింద‌ని చెప్పారు. ఇక ఈట‌ల స‌రైన నిర్ణ‌యం తీసుకున్నార‌ని, ఆయ‌న లాంటి నాయ‌కుడు బీజేపీలోకి రావ‌డం చాలా మంచి ప‌రిణామ‌మ‌న్నారు.