హైదరాబాద్ లోని పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. నహిదా క్వాద్రి అనే మహిళ స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్య కంటే ముందు సెల్ఫీ వీడియో తీసుకున్న నహిదా.. తనను దాబీర్ పుర కాంగ్రెస్ లీడర్ సలీం వేధిస్తున్నాడంటూ సెల్ఫీ వీడియోలో కన్నీరు పెట్టుకుంది. తన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో సలీం పోస్ట్ చేశాడానే అవమానంతో ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ప్రముఖ యుట్యూబ్ ఛానెల్ యాంకర్, న్యూస్ ఎడిటర్ గా బాధ్యతలు నహిదా నిర్వహిస్తున్నది.
తనతో కలిసి ఉండాలని, అసభ్యంగా మాట్లాడాలని సలీం వేధిస్తున్నాడు అంటూ ఆరోపణలు చేసింది నహిదా. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే తన కుటుంబ పరువు పోతుందని సెల్ఫీ వీడియోలో నహిదా ఆవేదన వ్యక్తం చేసింది. అయితే నహిదా కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కాంగ్రెస్ నేత సలీంను చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఒవైసి ఆస్పత్రిలో నహిదా చికిత్స పొందుతోంది.