బ్రేకింగ్: టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు బెయిల్

టీడీపీ యువ నేత, కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు జిల్లా కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. 14 షరతులతో లక్ష రూపాయలు పూచికత్తుతో ఆయనకు కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. బందరు వైసీపీ నేత, మంత్రి పేర్ని నానీ ప్రధాన అనుచరుడు మోకా భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్ర ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ హత్యా ఆయన పర్యవేక్షణలో జరిగింది అని పోలీసులు గుర్తించారు.

police arrested ex minister kollu ravindra
police arrested ex minister kollu ravindra

హత్య జరిగిన తర్వాత ఆయన విశాఖ పారిపోయే క్రమంలో తూర్పు గోదావరి జిల్లా పోలీసులు తుని వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకి పోలీసులు తరలించారు. ఇప్పటి వరకు రెండు మూడు సార్లు ఆయనకు బెయిల్ రద్దు అయింది. ఇప్పుడు ఎట్టకేలకు ఆయనకు బెయిల్ లభించింది.