అబ్బబ్బ ఎన్నాళ్లకెన్నాళ్ళకి — బాలయ్య అద్భుత నిర్ణయం !!

నందమూరి బాలయ్య బాబు చేస్తున్న సినిమాలు గత ఏడాది నుండి వరుసగా ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. ఒకపక్క రాజకీయ నాయకుడిగా మరోపక్క సినిమా హీరోగా రాణిస్తున్న బాలయ్య బాబు నటనలో మార్పు లేకపోవడంతో చివరి విడుదలైన సినిమా రూలర్ ఫ్లాప్ అయిన సందర్భంలో సొంత అభిమానులు బాలయ్య బాబు లో మార్పు రావాలి అంటూ కోరుకున్నారు.

Image result for balakrishna bold head

ఇటువంటి తరుణంలో ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్న బాలయ్య బాబు చాన్నాళ్ళకి ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్ లో వినబడుతున్న టాక్. మేటర్ లోకి వెళ్తే బోయపాటి తో చేయబోయే సినిమా మొత్తం ఎటువంటి విగ్గు లేకుండా మేకప్ లేకుండా ప్రస్తుతం ఉన్న గుండు తోనే సినిమా మొత్తం నటించాలని బాలయ్య బాబు డిసైడ్ అయినట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

 

దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో నందమూరి అభిమానులు అబ్బబ్బ ఎన్నాళ్లకెన్నాళ్ళకి ఖచ్చితంగా ఈ సినిమా హ్యాట్రిక్ హిట్ అవుతుందని కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా డైలాగ్ వర్షంలో కూడా కొద్దిగా మార్పు చేసుకుంటే బాగుంటుందని అభిమానులు సూచిస్తున్నారు. ఈ ఏడాది సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ ప్లాన్ చేస్తోంది.