బీసీలకు బాబు మొండిచేయి…

-

ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. అసెంబ్లీకి సంబంధించి 11 మంది, అలాగే 13 మంది ఎంపీ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధినేత చంద్రబాబు తాజాగా విడుదల చేశారు. ఊహించినట్లుగానే ఆశావహుల్లో కొందరికి అధిష్టానం మొండి చేయి చూపించింది. సీనియర్లలో కొందరికి సీట్లు దక్కగా.. మరికొందరికి మాత్రం చంద్రబాబు ఝలక్‌ ఇచ్చారు. తన సామాజిక వర్గానికి పెద్ద పీట వేసుకున్న చంద్రబాబు.. బడుగు, బలహీన వర్గాలకు వెన్నుపోటు అంటే రుచి చూపించారు.

జయహో బీసీ… అంటూ వారిని ఉద్దరిస్తామని టీడీపీ–జనసేన మొన్న సంయుక్తంగా ప్రకటించి నేడు విస్మరించాయి. బీసీలను అందులో ప్రధానంగా యాదవ సామాజికవర్గానికి ఉమ్మడి గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్క సీటు కూడా కేటాయించకుండా చంద్రబాబు వారి వెన్నుపోటు పోడిచారు. మరోవైపు గురజాల అసెంబ్లీ సీటు ఇస్తానని జంగాకు టీడీపీ నమ్మబలికి మొండిచేయి చూపింది. చీరాలలో టీడీపీ నేత, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మద్దులూరి మాలకొండయ్యను దాదాపు ఆ పార్టీ పక్కన పెట్టేసింది. టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు నూకసాని బాలాజీకి బాబు మొండిచేయి చూపారు. అయితే.. ఆ జిల్లాల్లో పార్లమెంట్‌ కానీ, అసెంబ్లీకి కానీ టికెట్లు కేటాయించకపోవటంతో టీడీపీపై యాదవులు రగిలిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news