బ్రేకింగ్: బీహార్ ఎన్నికల షెడ్యుల్ ప్రకటన…!

బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీని ఎన్నికల సంఘం ప్రకటించింది. 3 దశల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు సిఇసి ప్రకటించింది. మొదటి దశలో 71 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతాయి. రెండవ దశలో 94 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎన్నికలకు వెళ్తాయి. మూడవ దశలో 78 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది అని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ ఆరోరా చెప్పారు.

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అక్టోబర్ 28 న మొదటి దశ ఎన్నికలు, రెండో దశ ఎన్నికలు నవంబర్ 3న జరగనున్నాయి.నవంబర్ 7న మూడో దశ ఎన్నికలు ఉంటాయని చెప్పింది. నవంబర్ 10 న బీహార్ పోల్ ఫలితాలు ఉంటాయని ప్రకటించింది.