బ్రేకింగ్: ఎస్పీ బాలు పరిస్థితి చెప్పేసిన భారతి రాజా…!

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిని ప్రముఖ దర్శకుడు భారతీ రాజా స్పష్టంగా చెప్పారు. కరోనాను జయించి ఎస్పీ బాలు తిరిగి వస్తారని భావించామని ఆయన అన్నారు. బాలుని చూసి ఆయన కంట తడి పెట్టుకున్నారు. బాధాకర సమయంలో మాటలు రావడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. మరి కాసేపట్లో ఎస్పీ బాలు హెల్త్ బులిటెన్ విడుదల కానుంది.

బాలు ఫ్యామిలీ ఇప్పటికే ఎమ్జీఎం ఆస్పత్రి వద్దకు చేరుకుంది. తమ ప్రార్ధనలు ఫలించలేదు అని భారతీ రాజా చెప్పడంతో అభిమానులు కంట తడి పెట్టుకున్నారు. ఇక బాలు ఇంటి చుట్టుపక్కల మొత్తం కూడా శానిటైజ్ చేస్తున్నారు. బ్లీచింగ్ చల్లిన సిబ్బంది పటిష్ట చర్యలు చేపట్టారు.